Saturday, July 27, 2024
Homeతెలంగాణజగిత్యాల జిల్లా ప్రజలకు, అధికారులకు హోలీ పండుగ శుభాకాంక్షలు : జిల్లా ఎస్పీ అగ్గడి భాస్కర్

జగిత్యాల జిల్లా ప్రజలకు, అధికారులకు హోలీ పండుగ శుభాకాంక్షలు : జిల్లా ఎస్పీ అగ్గడి భాస్కర్

జగిత్యాల, మార్చి 7 (కలం శ్రీ న్యూస్):హోలీ పండుగ పురస్కరించుకుని మంగళవారం జగిత్యాల ఎస్పీ క్యాంపు కార్యాలయంలో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ వేడుకల్లో జిల్లా ఎస్పీ అగ్గడి భాస్కర్ పాల్గొని జిల్లా ప్రజలకు, అధికారులకు, సిబ్బందికి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్పీ భాస్కర్ మాట్లాడుతూ హోలీ వేడుకల సందర్భం గా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా లోని అన్ని పోలీసు స్టేషన్ లో రక్షక భట అధికారులతో సహా యావత్ సిబ్బంది తో తగిన ఏర్పాట్లు చేశామని.హోలీ వేడుకల్లో పాల్గొనే వారు మద్యం సేవించకుండా ప్రశాంత వాతావరణంలో పండుగ వేడుకలు నిర్వహించు కోవాలని సూచించారు. హోలీ వేడుకల అనంతరం స్నానాలు ఆచరించే సమయంలో బావులు, చెరువులు, కాలువల వద్ద తగు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మద్యం సేవించి పండుగ నిర్వహించి వాహనాలు నడపడం ద్వారా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కావున జిల్లా ప్రజలు ప్రశాంత వాతావరణంలో హోలీ వేడుకలు జరుపుకోవాలని జగిత్యాల ఎస్పీ భాస్కర్ సూచించారు.

ఈ యొక్క వేడుకల్లో డీఎస్పీలు ప్రకాష్, రవీంద్రరెడ్డి, సి.ఐ లు ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!