పడకల్ లో పీఎస్సార్ క్రికేట్ టోర్ని ప్రారంభం
జగిత్యాల, మార్చి 07 (కలం శ్రీ న్యూస్): ఎండపెల్లి మండలం పడకల్ గ్రామంలో వెల్గటూరు మాజీ యం.పి.పి బీ.ఆర్.ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పోనుగోటి శ్రీనివాస రావు సహకారంతో నిర్వహిస్తున్న క్రికేట్ టోర్నమెంట్ కార్యక్రమాన్ని పడ్కల్ సర్పంచ్ కంది లావణ్య విష్ణు, వెల్గటూరు మండల సర్పంచ్ ల ఫోరం సంఘం అధ్యక్షుడు గెల్లు చంద్ర శేఖర్ యాదవ్ లు, వెల్గటూరు మండల పరిషత్ కో- ఆప్షన్ సభ్యులు మహ్మద్ రియాజ్ ల చేతుల మీదుగా సంయుక్తంగా మంగళవారం ప్రారంభించారు. ఈ టోర్నీలో దాదాపు 40 జట్లు పాల్గోంటున్నట్లు నిర్వాహకులు మేకల అనిల్, సంతోష్, స్వామి, అక్షయ్, నవీన్ లు తెలిపారు.