బెదిరింపు రాజకీయాలకు కాంగ్రెస్ దూరం
ఎస్సీ, ఎస్టీల బలమే కాంగ్రెస్
మంథని మార్చి 06(కలం శ్రీ న్యూస్): బెదిరింపు రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు దూరంగా ఉంటుందని బ్లాక్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వేల్పుల రాజయ్య మండల అధికార ప్రతినిధి అన్నారు.బి ఆర్ఎస్ పార్టీలో నాయకుల మధ్య సఖ్యత లేకపోవడం వల్ల ఆమె భర్తకు సొంత పార్టీ నాయకులనుండే ప్రాణహాని ఉందని వారు స్వయంగా పత్రికాముఖంగా చెప్పడం బి ఆర్ఎస్ పార్టీకి సిగ్గుచేటు అని, వారు పేర్కొన్నారు.ఈ వ్యవహారాన్ని కప్పిపుచ్చడానికి బిఆర్ఎస్ నాయకుడు శంఖేష్ రవీందర్ శ్రీధర్ బాబుపై నోటికి వచ్చినట్లు మాట్లాడడాన్ని వారు ఖండించారు. జడ్పీ చైర్మన్ పుట్ట మధు అరాచకాలు పెరిగిపోతున్నాయని ప్రజలు ఇదంతా గ్రహిస్తున్నారని వారు చెప్పారు. కమాన్పూర్ మండల బిఆర్ఎస్ నాయకుడు పూదరి సత్యనారాయణ బెదిరింపులకు పాల్పడుతూ కోట్లాది రూపాయలు దండుకుంటున్నాడని వారు ఆరోపించారు.బహుజనవాదాన్ని వాడుకుంటూ వారినే అనుగ తో క్కుతున్నారని వారి సందర్భంగా గుర్తు చేశారు. ఈ విలేకరుల సమావేశంలో మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు మంథని రాకేష్ మంథని యూత్ కాంగ్రెస్ టౌన్ అధ్యక్షుడు పెంటరి రాజు,ఎస్సీ సెల్ టౌన్ అధ్యక్షుడు బండారి ప్రసాద్,ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి మంతెన సురేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లైసెెట్టి రాజు,గాజుల నిఖిల్, పొనగంటి నరేష్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.