పార్ట్ టైం టీచర్లకు న్యాయం చేయండి
ఎమ్మెల్యేకు వినతిపత్రం సమర్పించిన పార్ట్ టైం టీచర్లు
మంథని,మార్చి06(కలం శ్రీ న్యూస్):పార్ట్ టైం టీచర్లకు న్యాయం చేయాలని, ఏఐసీసీ కార్యదర్శి, మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబుకు పెద్దపెల్లి జిల్లా పార్ట్ టైం టీచర్ల యూనియన్ అధ్యక్షుడు పున్నం అధ్యక్షతన వినతి పత్రం సమర్పించారు. ఎన్నో సంవత్సరాలుగా వివిధ గురుకులాల్లో పార్ట్ టైం టీచర్లుగా పని చేస్తున్నటువంటి టీచర్ల సేవలను గుర్తించి వారి ఉద్యోగానికి భద్రత కల్పించడం వారికి పనికి తగిన వేతనం చేకూరేలా న్యాయం చేయమని వినతిపత్రం సమర్పించడం జరిగింది. దీనిపై సానుకూలంగా ఎమ్మెల్యే శ్రీధర్ బాబు స్పందిస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్ట్ టైం టీచర్లు సురేష్, నరసింహులు, లింగయ్య,రాజేష్,సంతోష్ కుమార్, రవీందర్ లు పాల్గొన్నారు.