Saturday, April 20, 2024
Homeతెలంగాణఅధ్వానంగా ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నిర్వహణ

అధ్వానంగా ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నిర్వహణ

అధ్వానంగా ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నిర్వహణ

24×7 వైద్య సేవలు ఉత్త ముచ్చటే : ఎర్రం ప్రవీణ్ యాదవ్

మేడ్చల్, మార్చి 6(కలం శ్రీ న్యూస్) :మేడ్చల్ పట్టణంలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నిర్వహణ పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల సకాలంలో వైద్యం రోగులకు అందక ఎదురవుతున్న ఇక్కట్ల గురించి పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతుంది. గతంలో అనేక సందర్భాల్లో సీ హెచ్ సీ ఆస్పత్రికి ప్రసవం కోసం పదుల సంఖ్యలో మహిళలను 108 అత్యవసర వాహనం ద్వారా మేడ్చల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఆస్పత్రి వైద్యులు ఏదో ఒక సాకు చూపి నగరంలోని ఆసుపత్రులకు చికిత్స నిమిత్తం రెఫర్ చేసిన సంఘటనలు అనేకమున్నాయి. ఇదిలా ఉంటే రెఫర్ చేసిన కేసులు నగరానికి తీసుకువెళ్తుంటే మార్గమధ్యంలోనే సుఖ ప్రసవాలు జరిగిన సంఘటనలు అనేకం. ఇదే విషయమై పలుమార్లు డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ ఆనంద్ దృష్టికి తీసుకెళ్లగా సదర వైద్యులను, కిందిస్థాయి స్టాఫ్ నర్స్, నర్సులను హెచ్చరించారు. ఇదిలా ఉంటే గత బుధవారం రాత్రి బాలమణి అనే గర్భిణీ స్త్రీ చికిత్స నిమిత్తం సదరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళగా గాంధీ ఆసుపత్రికి రెఫర్ చేశారు. విషయం తెలుసుకున్న మీడియా మిత్రులు సదరు ఆసుపత్రికి వెళ్లి ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా ఎందుకు రెఫర్ చేశారని డ్యూటీలో ఉన్న డాక్టర్ ను వీడియో చిత్రీకరిస్తూ ప్రశ్నించగా వీడియో, ఫోటోలు తీయొద్దని కెమెరాకు చేయి అడ్డం పెట్టగా నేను వీడియో తీయడం మీరు ఆపలేరని మాకు వీడియో తీసే హక్కు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిందని సమాధానం ఇచ్చారు. ఎంతోమంది నిరుపేద రోగులు రాత్రి సమయంలో మేడ్చల్ ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే అక్కడి వైద్యులు వారికి ఎం చూడకుండా గాంధీ ఆసుపత్రికి వెళ్లాలని తెలుపడం సిగ్గుచేటు అన్నారు. నెలనెలా లక్షల జీతాలు చేసుకుంటూ ప్రజలకు సేవ చేయాల్సిన ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు అనేకం వినిపిస్తున్నాయి. 

24×7 ఉత్త ముచ్చటే : ఎర్రం ప్రవీణ్ యాదవ్ 

ప్రజలకు ఏదైనా రోగమోస్తే కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆరోగ్య కేంద్రాలే దిక్కు. ఈ దవాఖానలు 24 గంటలు ట్రీట్మెంట్ చెయ్యాలె. కానీ అది ఉత్త ముచ్చటగానే మిగుల్తుంది. కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల్లో సరిపోనూ డాక్టర్లు, సిబ్బంది ఉండి వైద్యం సరిగ్గా అందుతలేదు. రోగులు పుల్లుగా వస్తున్నా వైద్యం చేసేటోళ్లు లేక తిరిగి వెనుకకు పోయే పరిస్థితి ఉంది. రాత్రి వేళ ఎవరికన్న ఏదన్న ఆపద వస్తే అంతే సంగతులు. చాలా చోట్ల రాత్రి ట్రీట్మెంట్ అందుతలేదు. మొత్తానికి పేదోళ్లకు వైద్యం అందని ద్రాక్షగా మారింది. ఓ దిక్కు ఎండలు మండుతుంటే ఆస్పత్రులల్ల మంచినీళ్లు ఉంటలేవు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!