Saturday, July 27, 2024
Homeతెలంగాణపూసాల బడిలో ముందస్తు మహిళా దినోత్సవ వేడుకలు.

పూసాల బడిలో ముందస్తు మహిళా దినోత్సవ వేడుకలు.

పూసాల బడిలో ముందస్తు మహిళా దినోత్సవ వేడుకలు.

సుల్తానాబాద్,మార్చి06,(కలం శ్రీ న్యూస్):పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిదిలోని పూసాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల మహిళా ఉపాధ్యాయులు ఉమా రాణి,సుజాత, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు సుజాత,స్వరూప,వనజ , మద్యాహ్నా భోజన సిబ్బంది కొమురమ్మ , రజిత, ఎల్లమ్మ ,శారద,లావణ్య లను ఉపాధ్యాయులు శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాద్యాయులు శశికాంత్ రెడ్డి మాట్లాడుతూ మహిళలు కుటుంబ నిర్మాతలని , మహిళలు ఆర్థిక స్వావలంబన సాదించాలని , మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే కుటుంబ వ్యవస్థ బలోపేతం అవుతుంది అని,కుటుంబ దిక్కు గా , సమాజ పెద్దగా మారే విదంగా మగిళా సాధికారత సాధించే దిశగా సమాజమే పూనుకోవాలని , మహిళల పై వివక్ష ఈనాటిది కాదని, పార్లమెంటరీ వ్యవస్థకు మాతృకగా చెప్పుకునే బ్రిటన్ దేశం లో రెండు శతబ్దాలకు పైగా మహిళలకు ఓటు హక్కు ఉండేది కాదని , అలాగే స్వేచా సమానత్వానికి ప్రతీక అయిన ఫ్రాన్స్ దేశం లో మహిళ ల ఓటు హక్కు కోసం ఏండ్ల తరబడి పోరాడితే గాని అక్కడ మహిళలకు పురుషులకు సమానంగా హక్కు దక్కలేదని , సామ్యవాద భావజాలానికి పురిటిగడ్డ అయిన రష్యా దేశం లో మహిళలు ఓటు హక్కు కోసం వినూత్న పోరాటాన్ని ఎంచుకోవాల్సి వచ్చింది అని , ఇలా ప్రపంచం లో అనేక దేశాల్లో మహిళల పట్ల వివక్ష కొనసాగింది అని , తరతరాలుగా వెనకబడిందని చెప్పబడిన భారత దేశం లో రాజ్యాంగం మహిళలకు సమాన హక్కులు కల్పించింది అని , స్థానిక సంస్థల్లోను ప్రత్యేక రిజర్వేషన్లు అమలు అవుతున్నాయని , ఉద్యోగ అవకాశాల్లోను మహిళలకు సముచిత స్థానం దక్కుతున్నప్పటికి సమాజం లో ఇంకా మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయని , అలాంటివి జరుగకుండా కఠిన నిబందనలు రూపొందించాల్సిన అవసరం ఉన్నదని అన్నారు .ఈ కార్యక్రమం లో ఉపాద్యాయులు రామకృష్ణ , మహేశ్వర్ , సతీష్ కుమార్ , సురేందర్ , తిరుపతిరావు , తిరుపతి , ఓయస్ లు శ్రీనివాస్ , కృష్ణ విధ్యార్థులు పాల్గొన్నారు. 

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!