Saturday, July 27, 2024
Homeతెలంగాణఅంగన్వాడీ టీచర్లు, ఆయాలు బానిసలు కాదు..

అంగన్వాడీ టీచర్లు, ఆయాలు బానిసలు కాదు..

అంగన్వాడీ టీచర్లు, ఆయాలు బానిసలు కాదు..

తనిఖీల పేరుతో వేధింపులకు గురి చేస్తే ఊరుకునేది లేదు.

ఏఐటీయూసీ పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్.

పెద్దపల్లి,మార్చి06(కలం శ్రీ న్యూస్):రామగుండం కార్పొరేషన్ పరిధిలోని రామగుండం అంగన్వాడి ప్రాజెక్ట్ లోని టీచర్లను, ఆయాలను శ్రమకు మించి విధులు నిర్వహిస్తు, ప్రభుత్వ పాలన విధివిధానాలతో సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తూ ప్రజలతో మమేకమవుతూ, ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రజా సంక్షేమ పధకాలను, కార్యక్రమాల విజయవంతానికి నిత్యం ప్రజలకు చేరువ చేయడంలో ముందు వరుసలో ఉంటూ, కరోనా సమయంలోనైతే ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించిన అంగన్వాడీ టీచర్లు, ఆయాలను సెంటర్లో తనిఖీల పేరుతో ఆందోళనకు గురి చేస్తు భయబ్రాంతులు చేయడం ఏమిటి అని? ఏఐటీయూసీ పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అంగన్వాడి అనేది ఒక వ్యవస్థ అని, వ్యవస్థలో ఎవరో ఒకరు గిట్టని వారు చెప్పిన మాటలకు లోనై ప్రాజెక్టులోని టీచర్లను, ఆయాలను ఆందోళనకు గురి చేయడం టార్గెట్ చేయడం సబబుగా లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రామగుండం అంగన్ వాడి ప్రాజెక్ట్ పరిధిలో జరుగుతున్న అనేక విషయాలపై ఎప్పటికప్పుడు విద్యా కమిషన్ తో చర్చించడం జరుగుతుందని, ఏమైనా ప్రాజెక్టులో లోటుపాట్లు జరిగితే రిజిస్టర్లు, రికార్డులు, ఎప్పటికీ అందుబాటులో ఉంటాయని, అలా కాకుండా భయభ్రాంతులకు గురి చేసే అటువంటి విధంగా అంగన్వాడి ప్రాజెక్టు సెంటర్లను, కుట్రపూరితంగా తనిఖీలు చేయడం, మానుకోవాలని డిమాండ్ చేశారు. కొంతమంది అంగన్ వాడి టీచర్ల కనుసన్నల్లో అధికారులు ఉండడం సరికాదని వారు అధికారులను హెచ్చరించారు.

రామగుండం ప్రొజెక్ట్ పరిధిలో ఇంచార్జ్ సిడిపిఓ పోస్టు కాకుండా శాశ్వత సీడీపీవో నియమించాలని డిమాండ్ చేశారు.

కన్న తల్లుల కంటే ఎక్కువగా పిల్లల్ని దరిచేరే విధంగా అహర్నిశలు కృషి చేస్తున్న అంగన్వాడి టీచర్లు ఆయాలపై కొంతమంది వేధింపులను వెంటనే మానుకోవాలని, అదే విధంగా పత్రికలను, పత్రిక విలేకరులను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని, వివిధ పార్టీల, యూనియన్లు మమ్మల్ని ఏమి చేయాబోరని నియంత లాగా మాట్లాడుతున్న వారి మాటలు హాస్యస్పందంగా, విచిత్రంగా, వింతగా ఉన్నాయని, ఇటువంటి పదాలు వాడడం గౌరవప్రదం కాదని హితవు పలికారు.

రామగుండం కార్పొరేషన్ అంగన్వాడి సెంటర్ల తనిఖీలపై స్పెషల్ ఎంక్వయిరీ జిల్లా కలెక్టరు యుద్ధప్రాతిపాదికన ఎంక్వయిరీ చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జిల్లా కలెక్టర్, విద్యా కమిషన్, రాష్ట్ర హెడ్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమాలు చేపట్ట వలసి వస్తుందని ఏఐటీయూసీ పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి రామగుండం నగర అధ్యక్షులు అబ్దుల్ కరీం, రామగుండం ఏఐటీయూసి నగర కార్యదర్శి శనిగరపు చంద్రశేఖర్ లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

 

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!