Saturday, July 27, 2024
Homeతెలంగాణగ్యాస్‌ ధర పెంపు బీజేపీ సర్కార్‌కు సమంజసమేనా..?

గ్యాస్‌ ధర పెంపు బీజేపీ సర్కార్‌కు సమంజసమేనా..?

గ్యాస్‌ ధర పెంపు బీజేపీ సర్కార్‌కు సమంజసమేనా..?

సామాన్యుడిపై ధరల భారం మోపుతున్న మోడీ సర్కార్‌

మంథని నియోజకవర్గ బీ.ఆర్.ఎస్ పార్టీ ఇంచార్జి,పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌

కాటారం,మార్చి03(కలం శ్రీ న్యూస్):పేద సామాన్య కుటుంబాలపై ధరల భారం మోపేలా గ్యాస్‌ సిలిండర్‌ ధరను పెంచడం బీజేపీ సర్కార్‌ సమంజసమేనా అని బీఆర్‌ఎస్‌ పార్టీ మంథని నియోజకవర్గ ఇంచార్జీ,పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ ప్రశ్నించారు.

 

గ్యాస్‌ సిలిండర్‌ ధరను పెంచడాన్ని నిరసిస్తూ కాటారం మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో మంథని నియోజకవర్గ బీఆర్ ఎస్ పార్ట్ ఇంచార్జి, పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ , భూపాలపల్లి జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ జక్కు శ్రీహర్షిని రాకేష్ ల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.

 

కేంద్రంలోని మోడీ సర్కార్‌ ప్రజావ్యతిరేక విధానాలపై మండిపడ్డారు. ఒకవైపు పెట్రోల్‌ డీజిల్‌ ధరలు పెంచుతూనే మరోవైపు గ్యాస్‌ సిలిండర్‌ ధరను పెంచారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతూ పేదలపై అధిక ధరల బారం మోపుతోందన్నారు. ఇటు రైతులను అటు అన్నం పెట్టే ఆడబిడ్డలను ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. మహిళలకు కట్టెల పొయి కష్టాలు లేకుండా గ్యాస్‌ సిలిండర్‌లు అందించామని గొప్పలు చెప్పుకుంటున్న మోడీ సర్కార్‌ గడిచిన తొమ్మిదేండ్లలో అనేక మార్లు గ్యాస్‌ సిలిండర్‌ ధరలు పెంచి నడ్డి విరిచిందన్నారు. సామాన్యులు గ్యాస్‌ సిలిండర్‌ వాడే పరిస్థితులు లేవని, ఢిల్లీలో కూర్చుండి ఎంతో అభివృద్ది, సంక్షేమం గురించి చెప్తున్నారని, కానీ క్షేత్రస్థాయిలో అలాంటి గొప్పలు లేవని ఆయన తెలిపారు. పేదవర్గాలపై భారం మోపేలా మోడీ సర్కార్‌ తీసుకునే నిర్ణయాలపై ఆలోచన చేయాలని ఆయన హితవు పలికారు.

అనంతరం భూపాలపల్లి జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ జక్కు శ్రీహర్షిణీ రాకేష్‌ మాట్లాడుతూ..గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ,400ల నుంచి రూ,1200 పెంచిన ఘనత బీజేపీ సర్కార్‌కే దక్కిందన్నారు. కట్టెల పొయిల నుంచి గ్యాస్‌ సిలిండర్‌ వాడే రోజుల నుంచి మళ్లీ కట్టెల పొయిలు వాడే రోజులు కన్పిస్తున్నాయని, మోడీ సర్కార్‌ చలువతోనే పేదోడికి ధరల బారం తప్పడం లేదన్నారు. సామాన్యుడి నడ్డి విరిచేలా పెంచిన ధరలను నియంత్రించాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా కేంద్రప్రభుత్వం ఆలోచన చేసి మహిళల, సామాన్యులకు మేలు చేయాలని ఆమె ఈ సందర్బంగా హితవు పలికారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!