Saturday, July 27, 2024
Homeతెలంగాణబంగారు తెలంగాణలో ప్రజా ప్రతినిధుల ఆత్మహత్యలు ఎందుకు..?

బంగారు తెలంగాణలో ప్రజా ప్రతినిధుల ఆత్మహత్యలు ఎందుకు..?

బంగారు తెలంగాణలో ప్రజా ప్రతినిధుల ఆత్మహత్యలు ఎందుకు

సుల్తానాబాద్,మార్చి02,(కలం శ్రీ న్యూస్):సుల్తానాబాద్ పట్టణంలోని బీఎస్పి కార్యాలయం నందు రేగడిమద్దికుంట సర్పంచ్ ఆత్మహత్యయత్నాన్ని కారణమైన ఈ నిర్లక్ష్యపు బీఆర్ఎస్ ప్రభుత్వ తీరును ఖండిస్తూ పత్రిక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీఎస్పీ జిల్లా అధ్యక్షులు గొట్టే రాజు , నియోజకవర్గ ఇన్చార్జ్ దాసరి ఉష హాజరై,అనంతరం వారు మాట్లాడుతూ ఈ బంగారు తెలంగాణలో సర్పంచులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకోవడం జరుగుతుందని ప్రశ్నిస్తూ, కేసీఆర్ మరి బంగారు తెలంగాణ అంటే సర్పంచుల ఆత్మహత్యలు చేసుకోవడమేనా, తెలంగాణలో గ్రామ సర్పంచుల పరిస్థితి చాలా దయనీయంగా మారిపోయిందనీ, సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంట గ్రామంలో రవీందర్ రెడ్డి అనే సర్పంచ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం చాలా బాధాకరమైన విషయమని,కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సర్పంచ్ ని పరామర్శించి, తను చేసిన పనులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి బిల్లు రాకపోవడం వల్లనే ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్లు చెప్పడం జరిగిందనీ, బహుజన్ సమాజ్ పార్టీ అండగా ఉంటుందని, రాబోయేది బహుజన రాజ్యమేనని,కేసీఆర్ తక్షణమే ఈ యొక్క గ్రామపంచాయతీ నిధుల విడుదల చేయాలని బహుజన సమాజ్ పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుందనీ అన్నారు.

 

ఈ కార్యక్రమంలో జిల్లా జోనల్ మహిళా కన్వీనర్ కుమ్మరి సవిత, జిల్లా అధ్యక్షులు గొట్టే రాజు, ఉపాధ్యక్షులు తోట వెంకటేష్ పటేల్, జిల్లా కార్యవర్గ సభ్యులు కంపల్లి బాబు నియోజకవర్గ అధ్యక్షులు బొంకురి దుర్గయ్య ఉపాధ్యక్షులు నార్ల గోపాల్ యాదవ్, ప్రధాన కార్యదర్శి సాతురి అనిల్, సుల్తానాబాద్ మండల అధ్యక్షులు బోయిని రంజిత్, సుల్తానాబాద్ పట్టణ అధ్యక్షులు తోట మధు పటేల్, బిఎస్పి నాయకులు పల్లె ప్రశాంత్,అలెపు శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!