Saturday, July 27, 2024
Homeతెలంగాణఘనంగా స్వర్గీయ శ్రీపాద రావు 86వ జయంతి వేడుకలు

ఘనంగా స్వర్గీయ శ్రీపాద రావు 86వ జయంతి వేడుకలు

ఘనంగా స్వర్గీయ శ్రీపాద రావు 86వ జయంతి వేడుకలు

 

మంథని మార్చి 02(కలం శ్రీ న్యూస్ ): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ అజాత శత్రువు స్వర్గీయ దుద్దిళ్ళ శ్రీపాద రావు 86వ జయంతి వేడుకలని మంథని మండల మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి, మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పాల్గొని పాద రావు విగ్రహాలకి మంథని శ్రీపాద చౌక్, రావుల చెరువు కట్ట లోని విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో మంథని ప్రభుత్వ వైద్యశాలలో మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు చేతుల మీదుగా రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం మంథని ప్రభుత్వ వైద్యశాలలో పని చేస్తున్న పారిశుద్ధ్య సిబ్బందికి నూతన వస్త్రాలను పంపిణీ చేశారు.శ్రీపాద రావు జయంతి సందర్భంగా డి.ఎస్.ఆర్ యువసేన ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాస రచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజెసిన మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శ్రీపాద రావు జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న శ్రీధర్ బాబు.నియోజకవర్గంలోని లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్, సీఎంఆర్ ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు.ఉద్యోగాల కోసం పోటీ పడుతున్న నిరుద్యోగులకు స్టడీ మెటీరియల్ నీ పంపిణీ చేశారు. పాద రావు 86వ జయంతి సందర్భంగా మంథని శ్రీపాద చౌక్, మంథని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏఐసీసీ కార్యదర్శి మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో అనేక సేవలందించిన నాయకుడు శ్రీపాద రావు.అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయాలన్నదే శ్రీపాద రావు ఆలోచన.ప్రజలకు ఉపయోగపడే అనేక రకమైన పాఠశాలలో కళాశాలలు రహదారులను నిర్మించిన నాయకుడు శ్రీపాద రావు.ప్రజలకు ఉపయోగపడే అనేక రకమైన అభివృద్ధి కార్యక్రమాలను శ్రీపాద రావు ఆలోచన మేరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ,నాయకుడి సహకారం తో సాధించి ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధిని అందించాం. బడుగు బలహీన వర్గాల విద్యాభివృద్ధికి అనేక పాఠశాలలు కళాశాలలు ఏర్పాటు చేశాం.ఈ ప్రాంతంలో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయాలని శ్రీపాద రావు ఆలోచన ఉండేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడగానే కళాశాలను ఏర్పాటు చేస్తాము.శ్రీపాద రావు మొట్టమొదటిసారి ఎన్నికైనప్పుడు మహా ముత్తారం మండల పరిషత్ సర్వసభ సమావేశానికి నడుచుకుంటూ వెళ్ళి రోడ్లు నిర్మాణం చేస్తే అదే రోడ్లపై ప్రయాణిస్తూ ఈరోజు కొంతమంది ఈ ప్రాంతానికి శ్రీపాద రావు ఏం చేశారు అని కుహ నా మాటలు మాట్లాడుతున్నారు.మంథని ప్రాంతం అంటే సరస్వతి నిలయం ఈరోజు ఏ పేరు ఉందో మంథనికి ప్రతి ఒక్క ప్రజానీకానికి తెలుసునని అందరం కూడా సమన్వయంతో ముందుకు నడవాలని ఇక్కడున్న వారంతా శాంతిని ప్రేమించేవారు కాబట్టి శాంతిని కాపాడే ప్రయత్నం చేయాలి దాడులు ,హత్యలు రాయలసీమలో జరుగుతాయి. అలాంటి వాటిని పక్కకు పెట్టాలని మా నాన్న ఆప్పటినుండి కాంగ్రెస్ పార్టీకి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు.

ప్రజాభిమానాన్ని చిరుగున్న నేత రావు ని ఇప్పటికీ ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయాడని వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరం పని చేద్దామని మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు , ప్రజాప్రతినిధులు ,యూత్ కాంగ్రెస్ నాయకులు దుద్దిళ్ళ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

 

 

 

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!