నేడు భారాస పార్టీ ఆధ్వర్యంలో ఎండపల్లి తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా
జగిత్యాల ,మార్చి (2 కలం శ్రీ న్యూస్):కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధర పెంపు, ప్రజా వ్యతిరేఖ విధానాలకు నిరసనగా భారాస పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున ఉదయం పదకొండు గంటలకు ఎండపల్లి మండల రెవెన్యూ శాఖ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం ఉంటుందని ఎండపల్లి మండల భారాస పార్టీ ఎండపల్లి మండల అధ్యక్షుడు సింహాచలం జగన్ తెలిపారు. కావున ఎండపల్లి మండలం లోని భారత రాష్ట్ర సమితి పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.