Monday, November 11, 2024
Homeతెలంగాణసుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ, పెన్షన్ ఇవ్వాలి.

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ, పెన్షన్ ఇవ్వాలి.

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ, పెన్షన్ ఇవ్వాలి.

సిఐటియు జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు

మంథని,మార్చి02(కలం శ్రీ న్యూస్):అంగన్వాడీ ఉద్యోగుల రాష్ట్రవ్యాప్త సమ్మెలో భాగంగా రెండవ రోజు మంథని కాలేజీ గ్రౌండ్ నుండి ఆర్డీవో ఆఫీస్ వరకు ర్యాలీ గా వెళ్లి అనంతరం ధర్నా నిర్వహించారు. ఇందులో ముఖ్యఅతిథిగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐసిడిఎస్ లో పనిచేస్తున్న అంగన్వాడీలకు చట్టం ప్రకారం గ్రాడ్యుటి, పెన్షన్ ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని 2022 మేలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని,ఈ తీర్పును అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు అమలు చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని, ఐసిడిఎస్ లో ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుందని, అందుకే 2023- 24 కేంద్ర బడ్జెట్లో నిధులు తగ్గించిందని, అదే జరిగితే పేద పిల్లలకు, గర్భిణీలకు, బాలింతలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. ఖాళీగా ఉన్న అంగన్వాడి టీచర్, ఆయా పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, ఆరోగ్యలక్ష్మి మెనూ చార్జీలను పెంచాలని, పెండింగ్ లో ఉన్న టిఏ,డిఏలు, సెంటర్ అద్దెలు వెంటనే విడుదల చేయాలని, ఆన్ లైన్ యాప్ లను రద్దు చేసి మాన్యువల్ గా పని తీసుకోవాలని, కేంద్ర ప్రభుత్వం పెంచిన వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఐసిడిఎస్ రక్షణ, అంగన్వాడి ఉద్యోగుల హక్కుల పరిరక్షణపై జరుగుతున్న ఈ సమ్మెలో భాగంగా రేపు మార్చి 3 న చలో కలెక్టరేటు ఉంటుందని, ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అంగన్వాడీ ఉద్యోగులు పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. కొంతమంది అధికారులు అతిగా ప్రవర్తిస్తు సమ్మెలో ఉన్న అంగన్వాడి ఉద్యోగులను బెదిరిస్తున్నారని, ఇది ఐసిడిఎస్ లో ఉన్న అధికారులకు వ్యతిరేకంగా జరుగుతున్న సమ్మె కాదని, ఐసిడిఎస్ రక్షణ కోసం, తమ హక్కుల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం కోసం జరుగుతున్న సమ్మె అనే విషయాన్ని అర్థం చేసుకుని మసులుకోవాలని తెలిపారు. అనంతరం ఆర్డిఓ కి వినతిపత్రం ఇచ్చారు.

 

ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు బూడిద గణేష్ అంగన్వాడి యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బి వనజారాణి నాయకులు కేశవ సుగుణ కృష్ణకుమారి,స్వరూప, సులోచన,చంద్రకళ, కమల బాయి, మల్లీశ్వరి, అంగన్వాడి ఉద్యోగాలు పాల్గోన్నారు.

 

 

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!