గాండ్ల తిలకుల యువజన సంఘం ఆధ్వర్యంలో శ్రీ నమ్మాళ్వార్ పరమపదోత్సవం
సుల్తానాబాద్,మార్చి01(కలంశ్రీ న్యూస్):సుల్తానాబాద్ పట్టణం లోని స్థానిక వేణుగోపాల స్వామిదేవాలయంలో నమ్మాళ్వార్ జ్యోతి దర్శనం, పరమపదోత్సవం ఘనంగా నిర్వహించారు.శ్రీ నమ్మాళ్వార్ కలియుగం ఆరంభం 42 వ రోజున సుమారు5100 సంవత్సరాల క్రితం గానుగ ద్వారా నూనె తీసే వృత్తిదారులు గాండ్ల కుల వంశంలో శ్రీ నమ్మాళ్వార్ జన్మించారు.ప్రతి వైష్ణవ దేవాలయం లో నమ్మాళ్వార్ పరమపదోత్సవం జరిపిన తర్వాత నే స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవం జరుపుతారని,నేటికి తిరుమలలో నిత్యం శ్రీ నమ్మాళ్వార్ రచించిన పాశురాలను పటిస్తారని సాక్షాత్తు శ్రీ రంగనాథుడే నా ఆళ్వార్ అని పిలిపించుకున్నాడు అందుకే ఆయనకి నమ్మాళ్వార్ అని పేరు వచ్చిందని ఆలయ అర్చకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అఖిల గాండ్ల తిలకుల సంఘం నాయకులు, లెక్కల శంకరయ్య గోపమ్మ, లెక్కల గంగాధర్ పల్లవి, యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లెక్కల నగేష్ లతశ్రీ, ఆలయ కమిటీ చైర్మన్ పల్లమురలి, అల్లంకి సత్యనారాయణ,పల్లా శరత్ అర్చకులు వేణుమాధవాచార్యులు, శ్రవనాచార్యులు,సౌమిత్రి వసుధ, వాని, హరిణీ భక్తులు పాల్గొన్నారు.