చత్రపతి శివాజీ విగ్రహా ఆవిష్కరణకు తరలి వెళ్ళిన సుల్తానాబాద్ బిజెపి శ్రేణులు
సుల్తానాబాద్,మార్చి 01(కలం శ్రీ న్యూస్): సుల్తానాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద నుండి బిజెపి అధ్వర్యంలో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి గ్రామమైన ధర్మారం మండలం కమ్మర్ ఖాన్ పెట గ్రామంలో శ్రీ చత్రపతి శివరాజ్ మహారాజ్ విగ్రహా ఆవిష్కరణకు డాక్టర్ కోవా లక్ష్మణ్ ముఖ్య అతిథిగా వచ్చిన సందర్భముగా సుల్తానాబాద్ నుండి బిజెపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సుల్తానాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద నుండి బైకులతో వెళ్ళడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి సుల్తానాబాద్ పట్టణ అధ్యక్షులు ఎల్లంకి రాజు. పట్టణ ఉపాధ్యక్షులు గజభింకార్ పవన్, ఎనగందుల సతీష్, దళిత మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు అరేపల్లి రాకేష్, జిల్లా సంయుక్త కార్యదర్శి బొట్టు శేకర్ గౌడ్, ఆకుల లక్ష్మన్, చర్లపల్లి రాజు, బి.జే. వై.ఎం పట్టణ అధ్యక్షులు మదరవెని అరవింద్,ఈశ్వర్, సుల్తానాబాద్ పట్టణ ప్రధాన కార్యదర్శి భూసారపు సంపత్, కూకట్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.