Tuesday, December 3, 2024
Homeతెలంగాణకళాకారుడికి దక్కిన అరుదైన గౌరవం

కళాకారుడికి దక్కిన అరుదైన గౌరవం

కళాకారుడికి దక్కిన అరుదైన గౌరవం

సిద్దిపేట,మార్చి01(కలం శ్రీ న్యూస్):

ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని ప్రజ్ఞాపూర్ గ్రామానికి చెందిన కళాకారుడికి దక్కిన అరుదైన గౌరవం. కన్నతల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గోవా ఇంటర్నేషనల్ అవార్డులో డాక్టరేట్ అవార్డు అందుకున్న ప్రజ్ఞాపూర్ యువకుడు.చిన్న వయసులోనే పాట పై మక్కువ పెంచుకొని పాటలు పాడుతూ, స్కూల్లో నిర్వహించే పాటల పోటీలలో తన ప్రతిభను కనబరుస్తూ వెలుగులోకి వచ్చాడు. ప్రజ్ఞాపూర్ గ్రామానికి చెందిన సిద్ధులు అనే యువకుడు వెన్నెల కళాబృందంలో సభ్యుడిగా చేరి తన పాటతో పలువుడితో శభాష్ అనిపించుకునే ప్రశంసలు పొందుతున్నాడు. తానే కాకుండా ఒక 14 మందికి శిక్షణ ఇచ్చి పల్లె మట్టి గొంతుక అనే టీం ను స్వయంగా తానే పది సంవత్సరాలుగా బాధ్యత వహిస్తూ, అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ తన ప్రతిభను చాటుతున్నాడు. ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్న నన్ను గుర్తించి నా కష్టానికి తగ్గ ఫలితం ఇచ్చారని, కన్నతల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నాకు గోవా ఇంటర్నేషనల్ డాక్టరేట్ అవార్డు ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని, కష్టపడ్డ నాకు ఇంకా మంచి స్థానం కల్పించాలని, అవకాశం కోసం ఎదురుచూసే నన్ను ఖచ్చితంగా ఆదుకోవాలని తెలియజేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!