Friday, December 27, 2024
Homeతెలంగాణప్రజాసంఘాల పోరాట ఫలితమే శ్రీపాదకాలని లో విద్యుత్ స్తంభాల ఏర్పాటు.

ప్రజాసంఘాల పోరాట ఫలితమే శ్రీపాదకాలని లో విద్యుత్ స్తంభాల ఏర్పాటు.

ప్రజాసంఘాల పోరాట ఫలితమే శ్రీపాదకాలని లో విద్యుత్ స్తంభాల ఏర్పాటు.

మంథని మార్చి01(కలం శ్రీ న్యూస్):

మంథని మున్సిపల్ పరిధిలోని శ్రీపాద కాలనీలో ప్రజాసంఘాల పోరాట ఫలితంగా విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయడం జరిగింది.ఆ విద్యుత్ స్తంభాల ఏర్పాటును ప్రజాసంఘాల నాయకులు పరిశీలించి కేవలం ఒక వాడకు మాత్రమే నామమాత్రంగా విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అలా కాకుండా శ్రీ పాద కాలని లోని మొత్తం వాడలలో విద్యుత్ స్తంభాల ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. అదేవిధంగా శ్రీపాద కాలనీలోని నిరుపేదలు నిర్మించుకున్న గృహాలకు ఇంటి నెంబర్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. శ్రీపాద కాలనీ కి సరైన రోడ్డు నిర్మాణాలు చేపట్టి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి గొర్రెoకల సురేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్ల సందీప్, ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎరుకల సాగర్, ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడు బందెల రాజ్ కుమార్ పాల్గొనడం జరిగింది

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!