Friday, September 20, 2024
Homeతెలంగాణసాఫల్య అవార్డు అందుకున్న గట్టు కృష్ణమూర్తి

సాఫల్య అవార్డు అందుకున్న గట్టు కృష్ణమూర్తి

సాఫల్య అవార్డు అందుకున్న గట్టు కృష్ణమూర్తి

మంథని మార్చి 01(కలం శ్రీ న్యూస్):మంథనికి చెందిన గట్టు కృష్ణమూర్తి జన్మ సాఫల్య అవార్డును అందుకున్నారు. జ్యోతిరావుపూలే,స్వామి వివేకానంద 160వ జయంతి సందర్భంగా వల్లూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కళాకారులు, సమాజా సేవా కార్యక్రమాలు నిర్వహించే వారికి హైదరాబాద్ లోని రవీంద్రభారతి అవార్డుల ప్రధానం కార్యక్రమం నిర్వహించారు.ఈ అవార్డుల ప్రధానంలో మంథనికి చెందిన గట్టు కృష్ణమూర్తి మొక్కలు నాటుతూ చెట్లను సంరక్షిస్తూ ప్రకృతిపై తనకున్న ప్రేమను చూపడంతో పాటు కవి,గాయకుడిగా రాణిస్తుండటం పట్ల జన్మ సాఫల్య అవార్డుకు ఎంపిక చేశారు.ఈ అవార్డును కృష్ణమూర్తి హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ మంత్రి వేణుగోపాలచారి, దైవజ్ఞన శర్మల చేతుల మీదుగా అందుకున్నారు. కృష్ణమూర్తికి ఈ అవార్డు రావడం ఇది రెండో సారి. ప్రకృతి ప్రేమికుడిగా జన్మ సాఫల్య అవార్డు అందుకున్న కృష్ణమూర్తిని మంథనికి చెందిన పలువురు ప్రముఖులు, ప్రజలు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!