ఆధారాలతో ఆరెంద బాగోతం బయటపెడతా
బాధితుడు బోరగళ్ళ రాణాప్రతాప్
పెద్దపల్లి,మార్చి 01:(కలం శ్రీ న్యూస్):తాను కొనుగోలు చేసిన స్థలంలోనే ఇంటిని నిర్మించుకుంటున్నానని,తనపై వ్యక్తిగత కక్ష్యతో ఆరెంద వెంకటస్వామి చేసిన ఆరోపణలో ఎలాంటి నిజం లేదని బోరగళ్ళ రాణాప్రతం స్పష్టం చేశారు.ఈ మేరకు బుధవారం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాణాప్రతాప్ మాట్లాడుతూ బండారికుంటలో ఉంటున్న ప్రస్తుత ధళితులు 1932 లో ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన భూమిలో ఉండగా అట్టి భూమిని ప్రభుత్వం స్వాదీనం చేసుకొని భూమికోల్పోయిన ధళితులకు ప్రస్తుత బండారికుంటలోని సర్వేనంబర్ 1లో కొనుగోలు చేసి,కళాశాల వద్డ భూమి నష్టపోయిన 86 మంది దళితులకు నష్టపరిహారం కింద అట్టి భూమిని పంపిణీ చేసిందని పేర్కోన్నారు.ప్రభుత్వం నుండి భూమి పొందిన బొంకూరి లస్మయ్య 1957 సంవత్సరంలో అప్పుడున్న గ్రామపంచాయతి నుండి అనుమతులతో నిర్మించుకున్న ఇంటిలో నివాసముంటున్నారని,అయితే వారు ఉద్యోగరిత్యా గత 15 సంవత్సరాలుగా గోదావరిఖని పట్టణంలో ఉంటున్నారని,పెద్దపల్లి మున్సిపల్ పరిది బండారికుంటలోని శిథిలావస్థకు చేరుకున్న బొంకూరి లస్మయ్య ఇంటిని తాను కొనుగోలుచేసి నూతనంగా ఇంటి నిర్మాణ పనులు చేపట్టుతున్న క్రమంలో ఆరెంద వెంకటస్వామి అడ్డుకుంటూ తనపై అసత్య ప్రచారాలు చేస్తూ అధికారులకు తప్పుడూ ఫిర్యాదులు చేస్తూ తప్పుదోవ పట్టిస్తున్నారడని పేర్కోన్నారు.బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా చెలామణి అవుతూ ఆరెంద వెంకటస్వామి చేస్తున్న అక్రమ బాగోతాలు ఆధారాలతో బట్టబయులుచేసి చట్టపరంగా పోరాటం సాగిస్తామన్నారు.ఈ సమావేశంలో వడ్డెపల్లి రాజు,వడ్డెపల్లి బాలయ్య లు పాల్గోన్నారు.