పరికిపండ్ల నరహరి ఐఏఎస్ జన్మదిన వేడుకలు
పెద్దపల్లి,మార్చి 01,(కలం శ్రీ న్యూస్):పెద్దపల్లి జిల్లా ధర్మరం మండల కేంద్రంలోని స్థానిక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఈరోజు మధ్యాహ్నం ఆలయ ఫౌండేషన్ ధర్మారం ఇంచార్జ్ మామిడిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మధ్యప్రదేశ్ కమిషనర్, సెక్రెటరీ, ఆలయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ పరికిపండ్ల నరహరి ఐఏఎస్ జన్మదినం సందర్భంగా విద్యార్థులకు నోటు బుక్స్, పెన్నులు, బిస్కెట్లు, పంచారు.
దాతలు మల్యాల సత్యనారాయణ వారి కుమారుడు శివ ఏకైక ముద్దుల కుమార్తె బియాన్సీ అక్షరాభ్యాసం సందర్భాన్ని పురస్కరించుకొని నరహరి జన్మదిన వేడుకలు జరిపారు.దాదాపు 200 మంది విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్స్, బిస్కెట్లు పంచి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఇంచార్జ్ శ్రీనివాస్ మాట్లాడుతూ పరికిపండ్ల నరహరి ఐఏఎస్ సాధారణ పేద కుటుంబం నుండి కష్టపడి చదివి ఐఏఎస్ సాధించారు. ఆయన పూర్తి విద్యాభ్యాసం ప్రభుత్వ పాఠశాలలో జరిగింది. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ భ్రుణ హత్యల నివారణకై హమారీ లాడ్లీ పథకం ప్రవేశపెట్టారు. వికలాంగుల కోసం ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో, పాఠశాలల్లో ర్యాంపుల నిర్మాణం చేపట్టారు. ఇండోర్ (మధ్యప్రదేశ్) పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దారు ఉత్తమ కలెక్టర్ గా రాష్ట్రపతి నుండి పలుమార్లు అవార్డులు పొందారు. ఇంకా మరెన్నో పథకాలను వాటికి బాటలు వేసి భారతదేశానికి ఆదర్శంగా నిలిచిన మన తెలంగాణ బిడ్డ పెద్దపల్లి జిల్లా వాస్తవ్యులు యువతరానికి ఆదర్శం, రేపటి తరాలకు ఆశా కిరణం సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన మండల విద్యాధికారి పి. ఛాయాదేవి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మల్లారెడ్డి ఉపాధ్యాయులు గంగారెడ్డి,ఆలయ ఫౌండేషన్ వాలంటీర్లు తాళ్లపల్లి సురేందర్ గౌడ్, కందుల సతీష్ మరియు విద్యార్థిలు తదితరులు పాల్గొన్నారు.