బోదకాలు వ్యాధిగ్రస్తులకు వ్యాధికి సంబంధించిన కిట్టులు పంపిణీ
సుల్తానాబాద్,మార్చి01(కలం శ్రీ న్యూస్):పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల లోని నారాయణరావు పల్లెలో బోదకాలు వ్యాధిగ్రస్తులకు బకెట్,మగ్గులు, వ్యాధికి సంబంధించిన కిట్టులు అందజేసిన సర్పంచ్ మొలుగూరి వెంకటలక్ష్మి అంజయ్య గౌడ్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పేదల ఆరోగ్యం పట్ల అనేక వ్యాధిగ్రస్తులను అక్కున చేర్చుకున్న వ్యక్తి అని, అలాగే బోదకాలు వ్యాధిగ్రస్తులకు దృష్టిలో ఉంచుకొని వారిని అన్ని రకాలుగా ఆదుకోవాలని ఉద్దేశంతో వారికి మందులు, అనేక వస్తువులు ఇవ్వడం జరిగిందనీ, పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి నిత్యం ప్రజల ఆరోగ్యం పట్ల, ప్రజల అభివృద్ధి పట్ల శ్రద్ధ చూపుతూ నారాయణరావుపల్లిలో బోధకాల వ్యాధిగ్రస్తులకు దృష్టిలో ఉంచుకొని మాకు పంపివ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గర్రెపల్లి సింగిల్ విండో డైరెక్టర్ చిగిరి సుజాత, ఏఎన్ఎం స్వరూప రాణి, జమున రాణి, ఆశా కార్యకర్తలు రమణ, సరూప, కళావతి, గ్రామ కార్యదర్శి వేముల సురేష్, సాయినాథ్, మల్లారెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.