వై కే ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రీడాకారులకు స్పోర్ట్స్ టీ షర్ట్స్ పంపిణి
సుల్తానాబాద్ మార్చి 1 కలం శ్రీ న్యూస్
సుల్తానాబాద్ మండలం ఐతరాజుపల్లి గ్రామం లోని క్రికెట్ క్రీడాకారులకు వై కే ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కండెం సురేష్ ఆదేశాల మేరకు 17 మంది క్రీడాకారులకు వై కే ఫౌండేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మడ్డి సాయికిషోర్ గౌడ్ చేతుల మీదుగా స్పోర్ట్స్ టీ షర్ట్స్ అందజేశారు.ఈ సందర్బంగా వై కే ఫౌండేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మడ్డి సాయికిషోర్ గౌడ్ మాట్లాడుతూ గ్రామం లోని క్రికెట్ క్రీడాకారులు అడిగిన వెంటనే టీ షర్ట్స్ అందించి క్రీడాకారులను ప్రోత్సహస్తున్న కండెం సురేష్ కి క్రీడాకారుల తరుపున కృతజ్ఞతలు తెలియజేసారు.
ఈ కార్యక్రమం లో వై కే ఫౌండేషన్ యువకులు ,క్రీడాకారులు పాల్గొన్నారు.