Saturday, July 27, 2024
Homeతెలంగాణఅంగన్ వాడి ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి

అంగన్ వాడి ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి

అంగన్ వాడి ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి

సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు బూడిద గణేష్

మంథని మార్చి 01(కలం శ్రీ న్యూస్): అంగన్ వాడి ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని సిఐటియు ఇచ్చిన సమ్మె పిలుపులో భాగంగా బుధవారం మంథని తహశీల్దారు కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో అంగన్ వాడి ఉద్యోగులు ధర్నా నిర్ణయించి అనంతరం తహశీల్దారు కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు బూడిద గణేష్ మాట్లాడుతూ 40 సంవత్సరాలుగా అంగన్ వాడి ఉద్యోగులు చాలీ, చాలని వేతనాలతో తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారని అన్నారు. అంగన్ వాడి ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం ఇవ్వాలని, పిఎఫ్, ఈఎఫ్ఐ సౌకర్యం కల్పించాలని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిటైర్డ్ అయ్యే ఉద్యోగులకు గ్రావిటీ సౌకర్యం కల్పించాలని, ఆరోగ్య లక్ష్మి మెనూ చార్జీ పెంచాలని, గత ఏడు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న టీఏ,డీఏలు చెల్లించాలని, జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్ వాడి టీచర్, ఆయా పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్ వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకురాలు సుగుణ, స్వరూప, అంగన్ వాడి టీచర్లు కనుకలక్ష్మి, జయప్రద, రాధాబాయి,రాజేశ్వరి, విజయలక్ష్మి, శారదా, రజిత ,వరుణ వనిత ,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!