ఘనంగా ఐఏఎస్ నరహరి జన్మదిన వేడుకలు
సుల్తానాబాద్,మార్చి01,(కలం శ్రీ న్యూస్):పద్మశాలి ముద్దుబిడ్డ పెద్దపెల్లి జిల్లా బసంత్ నగర్ వాసి, స్నేహశీలి ,మృదుస్వభావి, కార్యదీక్ష పరులు ,ప్రజాసేవ పరమావధిగా భావించే జనహృదయనేత, ఆలయ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మధ్యప్రదేశ్ పరిపాలన మున్సిపల్ కమిషనర్ అండ్ సెక్రటరీలో విధులు నిర్వహిస్తున్న పరికిపండ్ల నరహరి ఐఏఎస్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని పద్మశాలి యువజన సంఘం పెద్దపెల్లి జిల్లా అధ్యక్షుడు మేర్గు యాదగిరి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద కుటుంబం నుండి కష్టపడి చదువుకొని అంచలంచెలుగా ఎదిగి ఐఏఎస్ గా పదోన్నతి పొంది ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎంతోమందికి కృత్రిమ అవయవాలు, అందిస్తూ సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్న ఐఏఎస్ నరహరి కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ రానున్న రోజుల్లో ఇంకా అనేక ఉన్నత స్థాయిలో ఉండి నిరుపేదలకు సేవలు అందించాలని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో యువజన సంఘం నాయకులు బొద్దుల సాయినాథ్ ,దూడం లింగమూర్తి ,ప్రవీణ్ ,రామ్మూర్తి, నాయకులు రామస్వామి, వెంకటరమణ, తిరుమల్ దాస్, తదితరులు పాల్గొన్నారు.