Saturday, July 27, 2024
Homeతెలంగాణఅలయన్స్ క్లబ్ ఆఫ్ ధర్మారం ఆధ్వర్యంలో ఘనంగా టైలర్స్ డే వేడుకలు

అలయన్స్ క్లబ్ ఆఫ్ ధర్మారం ఆధ్వర్యంలో ఘనంగా టైలర్స్ డే వేడుకలు

అలయన్స్ క్లబ్ ఆఫ్ ధర్మారం ఆధ్వర్యంలో ఘనంగా టైలర్స్ డే వేడుకలు

పెద్దపల్లి, ఫిబ్రవరి 28(కలం శ్రీ న్యూస్):పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని మేరు సంఘం, టైలర్ యజమానుల సంఘం , టైలర్ వర్కర్ల సంఘంలకు సంబంధించిన టైలర్ వృత్తిదారుల ను సన్మానిస్తూ స్థానిక సతీష్ టైలర్ షాప్ లో అలయన్స్ క్లబ్ ఆఫ్ ధర్మారం అధ్యక్షుడు తాళ్లపల్లి సురేందర్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా టైలర్స్ డే వేడుకలు జరుపుతూ కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు.

 

అమెరికా దేశంలో 1819లో జన్మించిన విలియమ్స్ హో అతి చిన్న వయసులో 1845లో కుట్టు మిషన్ ను రూపొందించి ఫిబ్రవరి 28న ప్రపంచానికి అంకితం ఇచ్చారు. ఇదే రోజున ప్రపంచ దర్జీ కళా దినోత్సవం (టైలర్స్ డే) జరుపుకుంటారు. ఈ సందర్భంగా సురేందర్ మాట్లాడుతూ టైలర్ వృత్తి మీద ఆధారపడి ఎంతో మంది వివిధ కులాలకు చెందిన వారు జీవిస్తున్నారు. ముఖ్యంగా మేరు కుల వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్న మేరు కులవృత్తిదారులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఈ కుల వృత్తి మీద ఆధారపడుతున్న పేద బలహీన వర్గాలకు ప్రభుత్వం ప్రత్యేక ఫెడరేషన్ ఏర్పాటు చేసి మిగతా కులాలకు మాదిరిగానే చెందుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు మాదిరిగానే ఈ కులానికి కూడా వర్తింప చేసే విధంగా ఆలోచించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ధర్మారం మేరు సంఘం అధ్యక్షులు, ఆలయన్స్ క్లబ్ కార్యదర్శి మామిడి శెట్టి శ్రీనివాస్, పిఆర్ఓ అమరపల్లి నారాయణ, బైరి చంద్రమౌళి, తుమ్మల రాజశేఖర్, మేరు సంఘం కోశాధికారి మరియు క్లబ్ సభ్యులు కందుల సతీష్, ఉపాధ్యక్షులు మామిడి శెట్టి కొండయయ్య, తిరుపతి ,కందుల మల్లేష్, టైలర్ యజమానుల సంఘం అధ్యక్షులు శంకర్ ట్రైలర్ కిష్టయ్య, డి.ఎన్. రావు ,కార్తీక్ టైలర్ రాజు, సాయిరాం టైలర్, సాయి టైలర్ రవి, వివిధ టైలర్ యజమానులు, వర్కర్ల యూనియన్ అధ్యక్షులు వెంకటేశం,లింగమూర్తి, వెంకటేశ్వర్లు ఇతర మేరు కులస్తులు,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!