మంథని మత్స్య పారిశ్రామిక సహకార సంఘ కార్యాలయానికి నిధులు మంజూరు చేయండి
మంథని ఫిబ్రవరి 28(కలం శ్రీ న్యూస్):మంథని మత్స్యపారిశ్రమిక సహకార సంఘ కార్యాలయ నిర్మాణానికి అనుమతినిస్తూ నిధులు మంజూరు చేయాలని మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ సంఘం నాయకులు వినతి పత్రం అందజేయడం జరిగింది.మంగళవారం మంథని మున్సిపల్ కార్యాలయంలో జరరుగు పాలక వర్గ సమావేశం లో మంథని మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో కార్యాలయానికి అనుమతినిస్తు పది లక్షల రూపాయలు నిధులు మంజూరు చేసి మత్స్య పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడాలని మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమం లో మంథని మత్స్యపారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు పోతరవేని క్రాంతి కుమార్, ఉపాధ్యక్షులు నరెడ్ల కిరణ్, కార్యదర్శి గుండా రాజు,డైరెక్టర్లు అంకరి కుమార్,గుండా రాజు,సిలువెరి భునన్న, బయ్య రాజేష్ మరియు కుల పెద్దలు పోలు కనకరాజు,సబ్బని సమ్మయ్య, పోతరవేని అర్జున్,సుంకరి జగదీష్, పోలు కృష్ణ లు పాల్గొన్నారు.