బీమా పథకాలతో ప్రతీ కుటుంబానికి ధీమా
కెడిసిసి బ్యాంక్ మేనేజర్ దుమ్మని లక్ష్మణ్
మంథని ఫిబ్రవరి 28(కలం శ్రీ న్యూస్): కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భీమా పథకాలతో ప్రతీ కుటుంబానికి ధీమా లభిస్తుందని కెడిసిసి బ్యాంక్ మంథని మేనేజర్ దుమ్మని లక్ష్మణ్ అన్నారు. మంథని మండలం బిట్టుపల్లి గ్రామానికి చెందిన సిలివేరి జయలక్ష్మీ సహజ మరణం చెందగా, ఆమె పేరిట మంజూరైన రూ.2 లక్షల విలువ గల చెక్కును ఆమె కూతురు అనూషకు మంగళవారం మేనేజర్ దుమ్మని లక్ష్మణ్ అందజేశారు. సహకార బ్యాంకు యందు సేవింగ్ ఖాతా కలిగిన ప్రతీ ఒక్కరు ప్రధానమంత్రీ భీమా యోజన, జీవనజ్యోతి పథకాలకు ఇన్స్యూరెన్స్ తీసుకుంటే ఆ కుటుంబాలకు కష్టకాలంలో ఇన్స్యూరెన్స్ వల్ల ధీమా కలుగుతుందని అన్నారు. మా బ్యాంక్ యందు సేవింగ్ ఖాతా కలిగిన ప్రతీ ఒక్కరు తమ ఖాతాలో తగు బ్యాలన్స్ నిర్వహణ చేసుకోవాలని సూచించారు. కావున ప్రతీ ఒక్కరు ప్రధాన మంత్రి బీమా యోజన పథకానికి రూ.342, జీవనజ్యోతి పథకానికి రూ.20 చెల్లిస్తే ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.4 లక్షలు, సహజ మరణం చెందితే రూ.2 లక్షలు లభిస్తాయని తెలిపారు.