వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా మోత్కూరి శ్రీనివాస్
మంథని ఫిబ్రవరి 26(కలం శ్రీ న్యూస్ ):మంథని వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా మోత్కూరి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా తాటి సమ్మయ్య గౌడ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం మంథని పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఎన్నికలను నిర్వహించడం జరిగింది.నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.అధ్యక్షులుగా మోత్కూరి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా తాటి సమ్మయ్య గౌడ్, ఉపాధ్యక్షులుగా ఇసంపల్లి కొమురయ్య, సహాయ కార్యదర్శిగా కమ్మగోని రవికుమార్, కోశాధికారిగా కొమరవెల్లి రాజు లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.