మంథని గానగంధర్వుడు గంగా రాజు మృతి
మంథని ఫిబ్రవరి 26(కలం శ్రీ న్యూస్ ):మంథని గాన గంధర్వుడిగా పేరొందిన గంగా రాజు (65) శనివారం రాత్రి మృతి చెందారు. ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రసిద్ధిగాంచిన మంథని పట్టణంలో ఏ దేవాలయంలో భజన కార్యక్రమం జరిగిన గంగా రాజు పాటలే వినిపించేది. ఆయన పాడిన పాటలు ఇప్పటికీ ప్రజలు మర్చిపోలేకపోతున్నారు. ఎక్కడ భజన కార్యక్రమం జరిగిన గంగా రాజు పాడిన రా దిగిరా దివి నుంచి బువికి దిగిరా అనే పాటకు భక్తులు మంత్రముగ్ధులయ్యేవారు. శ్రీ లక్ష్మీ నారాయణస్వామి దేవస్థానం అధ్యక్షులుగా గతంలో విశేష సేవలు అందించిన గంగా రాజు మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం అవుతుంది. ఆయన లేని లోటు పూడ్చలేనిదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు.