ఎస్.బి.ఐ సేవలను సద్వినియోగం చేసుకోవాలి
చీఫ్ మేనేజర్ వెంకటేశ్వర్లు
మంథని ఫిబ్రవరి 26(కలం శ్రీ న్యూస్ ): స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవలను కస్టమర్లు సద్వినియోగం చేసుకోవాలని మంథని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యవసాయ అభివృద్ధి శాఖ చీఫ్ మేనేజర్ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఆదివారం మంథని మండలంలోని కాకర్లపల్లి, సురాయ్యపల్లి, అక్కేపల్లి తో పాటు వివిధ గ్రామాల్లో స్టేట్ బ్యాంకు వినియోగదారులకు డిపాజిట్లపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలోనే అత్యధికంగా నమ్మకమైన బ్యాంకుగా స్టేట్ బ్యాంకు కొనసాగుతుందని, స్టేట్ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ లపై అత్యధిక వడ్డీని ఇస్తున్నామని 400 రోజుల డిపాజిట్ పై 7.1% వడ్డీని ఇస్తున్నామని వృద్ధులకు ప్రత్యేకంగా 7.6% వడ్డీని ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ అవగాహన సదస్సులో సర్వీస్ మేనేజర్ విజయ్ తో పాటు బ్యాంకు సిబ్బంది వినియోగదారులు పాల్గొన్నారు.