బిఆర్ఎస్ లో చేరికలు
ఫిబ్రవరి 25(కలం శ్రీ న్యూస్ ):మంథని పలిమేల మండలం పంకేన గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కమ్ముల రంజిత్, వార్డ్ మెంబర్ ఎర్ని సుధాకర్, ఎర్ని శ్రీను,కమ్మల కమలాకర్, మద్దెల వెంకటి వారితో పాటు సుమారు 20 మంది మంథని నియోజకవర్గ బీఆర్ ఎస్ పార్టీ ఇంచార్జి, పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్,జిల్లా యువనాయకులు జక్కు రాకేష్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ లో చేరడం జరిగింది.వారికి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధూకర్ కండువా కప్పి బీఆర్ ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.