మాతాశిశు ఆస్పత్రిసేవలను సద్వినియోగం చేసుకోవాలే
జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్
మంథని ఫిబ్రవరి 25(కలం శ్రీ న్యూస్ ):పేదింటి ఆడబిడ్డల కాన్పుల భారం పడవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన మాతా శిశు ఆస్పత్రులను సద్వినియోగం చేసుకోవాలని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ కోరారు.మంథని పట్టణానికి చెందిన విష్ణుభక్తుల రఘు కూతురు సాహితీ పండంటి బిడ్డకు జన్మనివ్వగా వారిని జెడ్పీ చైర్మన్ కలిసి తల్లి బిడ్డల ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పేదింటి వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక గొప్ప కార్యక్రమాలుచేస్తోందన్నారు. ముఖ్యంగా పేదవారి ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టిసారించి,వారికి మెరుగైన వైద్యం అందించే దిశగా అనేక చర్యలు తీసుకుంటుందన్నారు.అలాగే ఆస్పత్రికి వచ్చే వారి పట్ల సిబ్బంది మర్యాద పూర్వకంగా మెలగాలని, వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు. తల్లిబిడ్డల ఆరోగ్యంపట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని ఆయన సిబ్బందికి సూచించారు.