మీడియాపై దాడికి జర్నలిస్టుల నిరసన
పెద్దపల్లి, ఫిబ్రవరి 25(కలం శ్రీ న్యూస్):తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జర్నలిస్టులపై దాడులు పెరుగుతున్నాయని, దాడులకు పాల్పడుతున్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా నిన్న రాత్రి మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని సుద్దాల గ్రామంలో బిజెపి కార్నర్ మీటింగ్ న్యూస్ కవరేజ్ కి వెళ్ళిన V6 మీడియా ప్రతినిధులపై అధికార పార్టీ నాయకులు చేసిన దాడిని పెద్దపల్లి జిల్లా జర్నలిస్టులు ఖండించారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి జర్నలిస్టులు నిరసన తెలియజేశారు. దాడికి పాల్పడిన బీఆర్ఎస్ లీడర్ల పై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. ఈ ఆందోళనలో పెద్దపల్లి, గోదావరిఖని, మంథనికి చెందిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు కొట్టే సదానందం, వడ్డేపల్లి రవీందర్, పి. శ్యాంసుందర్, తిర్రి తిరుపతి,తొట్ల తిరుపతి యాదవ్, దుర్గం లక్ష్మణ్, హరికృష్ణ, ఎండి ఫయాజ్, సమ్మయ్య, శంకర్, అంజి, పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు.