Tuesday, October 8, 2024
Homeతెలంగాణగ్లోబల్ పద్మశాలి సదస్సుకు హాజరు కానున్న బొద్దుల లక్ష్మణ్ 

గ్లోబల్ పద్మశాలి సదస్సుకు హాజరు కానున్న బొద్దుల లక్ష్మణ్ 

గ్లోబల్ పద్మశాలి సదస్సుకు హాజరు కానున్న బొద్దుల లక్ష్మణ్ 

పెద్దపల్లి ఫిబ్రవరి 25(కలం శ్రీ న్యూస్):

 

ఈనెల 25 26 తేదీల్లో దుబాయిలో నార్త్ అమెరికన్ పద్మశాలి అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరల్డ్ గ్లోబల్ పద్మశాలి సదస్సుకు జూలపల్లి జెడ్పిటిసి బొద్దుల లక్ష్మణ్ ప్రత్యేక ప్రతినిధిగా హాజరుకానున్నారు. ఈ సమావేశానికి ప్రపంచ నలుమూలల నుండి వివిధ రంగాల్లో నిపుణులైన పద్మశాలి ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సమావేశంలో పద్మశాలి సమాజం ఎదుర్కొంటున్న రాజకీయ , ఆర్థిక అంశాలపై చర్చలు ఉంటాయని దానితో పాటు వివిధ అంశాలపై భవిష్యత్ కార్యాచరణ ఈ సమావేశంలో రూపొందించినట్లు తెలిపారు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పద్మశాలీలను ఏకతాటిపై తీసుకురావడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమన్నారు.

గతంలో పద్మశాలి సమాజం నుండి వివిధ రాష్ట్రాల్లో నీ చట్టసభల్లో భారత పార్లమెంట్లో ప్రతినిధులు ఉండేవారని, ప్రస్తుత కాలంలో తిరోగమన దిశలోకి పద్మశాలి సమాజం నెట్టి వేయబడడానికి గలా కారణాలు,ఇట్టి పరిస్థితిని ఎలా అధిగమించాలో ఈ సదస్సులో కూలంకషంగా చర్చించనున్నట్లు చెప్పారు. అంతేకాకుండా చేనేతను దెబ్బతీసే విధంగా పవర్ లూమ్స్ పరిశ్రమ, చేనేత ఉత్పత్తులను తమ టెక్నాలజీ ద్వారా ఉత్పత్తి చేసి, చేనేత పరిశ్రమను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్న తీరును, చేనేతపై జిఎస్టి విధించి చేతి వృత్తులను అతలాకుతం చేస్తున్న జీఎస్టీ విధానంపై చర్చించినట్లు తెలియజేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!