Saturday, July 27, 2024
Homeతెలంగాణబొద్దుల ఆర్థిక సహాయం

బొద్దుల ఆర్థిక సహాయం

బొద్దుల ఆర్థిక సహాయం

పెద్దపల్లి ఫిబ్రవరి 25(కలం శ్రీ న్యూస్):

పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం లాలపల్లి గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన న్యాతరి లచ్చయ్య కుటుంబ ఆర్థిక పరిస్థితిని గురించి ఎలిగేడు మండల అధ్యక్షులు బింగి రాజు గారు, కేసిఆర్ సేవా దళం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు, జూలపల్లి మండల జెడ్పిటిసి బొద్దుల లక్ష్మణ్ కి వివరించి, వారి కుటుంబానికి ఆర్ధిక సహాయం అందించాలని కోరగా వెంటనే స్పందించి లచ్చయ్య కుటుంబానికి 4000 రూపాయల ఆర్థిక సహాయం మండల అద్యక్షులు బింగి రాజు ద్వారా పంపిన చేయించిన లక్ష్మణ్ .

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, అన్నా! మేము ఆపదలో ఉన్నాం! మీ సహాయం మాకు కావాలి అంటే వెంటనే స్పందించే నాయకుడు బొద్దుల లక్ష్మణ్ అన్న , నాయకుడు అంటే నలుగురు కి సహాయం చేయాలి, అలాగే చేస్తూ తన వంతుగా ఎందరికో సహాయం చేస్తున్న లక్ష్మణ్ అన్న నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాము అని అన్నారు.

ఈ కార్యక్రమంలో కేసిఆర్ సేవా దళం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు దండే వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి చాతళ్ళ కాంతయ్య, జిల్లా కార్యదర్శి చొప్పరి మహేష్, జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి బొద్దుల సాయినాథ్, మండల నాయకులు పిట్టల నరేష్, అమరగాని శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!