జూలపల్లిలో బోర్ వెల్ ఏర్పాటుకు భూమి పూజ
పెద్దపల్లి ఫిబ్రవరి 23(కలం శ్రీ న్యూస్ ):కమాన్ పూర్ మండలంలోని జూలపల్లి గ్రామంలోని మల్లిఖార్జున స్వామి, బీరన్న ఆలయాల ప్రాంగణంలో సింగరేణి నిధుల ద్వారా బోర్ర్ వెల్ ఏర్పాటు కోసం గురువారం స్థానిక సర్పంచ్ బొల్లపెల్లి శంకర్ గౌడ్ భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ సింగరేణి ప్రభావిత గ్రామాభివృద్ధికి సింగరేణి సంస్థ అభివృద్ధి పనుల కోసం నిధులు కేటాయిస్తుండడం హర్షనీయమన్నారు. మా గ్రామంలోని రైతులు సింగరేణి, ఎన్ టీ. పీ. సీ సంస్థలకు సిరులు పండే పంట భూములను త్యాగం చేయడం జరిగిందన్నారు. ఇంకా ఈ రెండు సంస్థ లు గ్రామ అభివృద్ధికి మరింత దోహదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులు ఎస్ ఈ సివిల్ పద్మరాజు, డివైజిమ్ షఫీ సివిల్ సూపెర్వైసర్ సమ్మయ్య మల్లిఖార్జున స్వామి దేవస్థానం చైర్మన్ ఎలబోయిన కుమార్, కుర్మ సంఘము అధ్యక్షులు కొమ్ము వెంకన్న, బీరన్న ఆలయ చైర్మన్ కొమ్ము గోపాల్, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.