Saturday, April 20, 2024
Homeతెలంగాణఅక్రమ పట్టా చేసిన రెవెన్యూ అధికారిపై చర్యలు తీసుకోవాలి

అక్రమ పట్టా చేసిన రెవెన్యూ అధికారిపై చర్యలు తీసుకోవాలి

అక్రమ పట్టా చేసిన రెవెన్యూ అధికారిపై చర్యలు తీసుకోవాలి

 

మంథని ఫిబ్రవరి 23(కలం శ్రీ న్యూస్):మంథని మండలంలోని కన్నాల గ్రామ శివారు సర్వేనెంబర్ 179లో మూడు ఎకరాలు, సర్వేనెంబర్ 180లో మూడు ఎకరాలు అక్రమ పట్టా చేసిన రెవెన్యూ అధికారిపై తగు చర్యలు తీసుకోవాలని బాధితుడు ఎరుకల రాములు ఎరుకల మధు ఎరుకల చంద్రశేఖర్ ఎరుకల శివకుమార్ కోరారు. ఇట్టి భూమిపై మంథని కోర్టులో పంపకానికి కేసు వేయడం జరిగిందన్నారు. గత తహసిల్దార్ ఆర్ యూ పి పై విచారణ చేయకుండా అక్రమ పట్టా చేసినాడు. మాకు చెందవలసిన భూమిని మాకు పట్టా ఇవ్వాలని కోరారు.గత కొన్ని సంవత్సరాల నుండి ఉమ్మడి స్థిరాస్తిగా వ్యవసాయం చేసుకుంటున్నాం. ఈ భూమిని గతంలోని అధికారులు అక్రమ పట్టా చేయడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. ఉమ్మడి శీరాస్థాయిన వ్యవసాయ భూమిని ఇతరులకు పట్టా చేయకుండా చూడాలని మాకు అన్యాయం చేయవద్దని కోరారు. ఇట్టి భూమి విషయం పై మంథనికోర్టులో భూమి పంపకాల కేసు వేయడం జరిగిందని,మా భూమి మాకు వచ్చే విధంగా ఇప్పుడున్న అధికారులు తగు చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయగలరని విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!