Tuesday, December 3, 2024
Homeతెలంగాణపెద్దమ్మ దేవాలయ నిర్మాణానికి 25 వేల విరాళం అందించిన బొద్దుల

పెద్దమ్మ దేవాలయ నిర్మాణానికి 25 వేల విరాళం అందించిన బొద్దుల

పెద్దమ్మ దేవాలయ నిర్మాణానికి 25 వేల విరాళం అందించిన బొద్దుల

పెద్దపల్లి,ఫిబ్రవరి,23(కలం శ్రీ న్యూస్):సుల్తానాబాద్ మండలంలోని తొగర్రాయి గ్రామంలో నూతనంగా నిర్మాణం చేపట్టిన ముదిరాజ్ కులస్తుల ఆరాధ్య దైవమైన పెద్దమ్మతల్లి దేవాలయ నిర్మాణానికి దేవాలయ కమిటీ అధ్యక్షుడు పిట్టల తిరుపతి ఆధ్వర్యంలో గురువారం ఉదయం హోమయజ్ఞం, కుంకుమ పూజ అంగరంగ వైభవంగా కులస్తుల ఆధ్వర్యంలో చేయగా, మహిళలు కుటుంబ సమేతంగా పెద్ద ఎత్తున పాల్గొన్నారు . జూలపల్లి జడ్పిటిసి, కెసిఆర్ సేవాదళం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొద్దుల లక్ష్మన్ ను కోరగా స్పందించిన బొద్దుల లక్ష్మణ్ వారి కోరిక మేరకు వెంటనే 25వేల 116 రూపాయల విరాళాన్ని దేవాలయ నిర్మాణానికి హామీ ఇవ్వగా గురువారం కేసీఆర్ సేవాదళ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దండే వెంకన్న పటేల్ ,చాతల కాంతయ్య ఆధ్వర్యంలో తొగరాయిలోని దేవాలయ వద్దకు వెళ్లి విరాళం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ సేవాదళం ఆధ్వర్యంలో అనేకమందికి ఆర్థిక సహాయాలు ,విరాళాలు అందిస్తూ తన ఉదార హృదయాన్ని చాటుకుంటున్నాడు. ఈ సందర్భంగా పెద్దమ్మ తల్లి దేవాలయ పాలకమండలి సభ్యులు లక్ష్మణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కెసిఆర్ సేవాదళం పెద్దపల్లి జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి బొద్దుల సాయినాథ్ ,పెద్దమ్మ తల్లి పాలకవర్గ సభ్యులు పోచమళ్లు, అనిల్ ,రమేష్, శ్రీనివాస్ ,సంపత్ ,రాజు, అజయ్ ,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!