Saturday, April 20, 2024
Homeతెలంగాణరోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సింగర్ మంగ్లీ

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సింగర్ మంగ్లీ

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సింగర్ మంగ్లీ

హైదరాబాద్,మార్చి18(కలం శ్రీ న్యూస్):సింగ‌ర్ మంగ్లీకి త్రుటిలో ప్రమాదం తప్పింది. మంగ్లీ ప్రయాణిస్తున్న కారును ఓ డీసీఎం ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఆమెతో పాటు కారులో ప్ర‌యాణిస్తున్న ఇద్ద‌రికి స్వ‌ల్ప గాయాల‌ య్యాయి.

హైదరాబాద్,బెంగళూరు జాతీయ రహదారిపై తొండుపల్లి వంతెన వద్ద ఆదివారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగిందని శంషాబాద్ పోలీసులు తెలిపారు.రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతి వనం లో ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవానికి మంగ్లీ శనివారం హాజరయ్యారు. అదేరోజు అర్ధరాత్రి తర్వాత మేఘ్‌రాజ్‌, మనోహర్‌తో కలిసి ఆమె కారులో తిరుగు ప్రయాణం అయ్యారు.హైదరాబాద్‌-బెంగళూర్‌ జాతీయ రహదారి మీదుగా ఇంటికి బయల్దేరారు. శంషా బాద్‌ మండలం తొండుపల్లి వంతెన వద్దకు రాగానే కర్ణాటకకు చెందిన ఓ డీసీఎం వాహనం వెనక నుంచి వేగంగా వచ్చి కారును ఢీకొట్టింది.

ఈ ఘటనలో కారులో ఉన్న ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదంలో కారు వెనక భాగం పూర్తిగా దెబ్బతింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియవలసిఉంది.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!