తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఖరారు.
ఈ నెల 7న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…!
హైదరాబాద్,డిసెంబర్5(కలం శ్రీ న్యూస్): కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎంపిక ఫైనల్ అయింది. టీపీసీసీ చీఫ్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డినే తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని కాంగ్రెస్ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ అధికారికంగా ప్రకటించారు.ఈ నెల 7న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నట్లుగా తెలుస్తోంది.