Wednesday, November 29, 2023
Homeతెలంగాణతెలంగాణలో మూడు రోజులు మద్యం దుకాణాలు బంద్

తెలంగాణలో మూడు రోజులు మద్యం దుకాణాలు బంద్

తెలంగాణలో మూడు రోజులు మద్యం దుకాణాలు బంద్

హైదరాబాద్:నవంబర్ 21(కలం శ్రీ న్యూస్):తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు పదిరోజులే ఉండటంతో ప్రచారంలో అభ్యర్థులు స్పీడ్ పెంచారు. చివరి దశకు చేరుకోవడంతో ఉన్న అస్త్రాలు అన్నీ వాడుతున్నారు.

ఈసారి ఎలాగైనా గెలవాలని వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికల వేళ మంచిగా చిల్ అవ్వొచ్చు అనుకున్న మందుబాబులకు ఎన్నికల సంఘం షాకిచ్చింది.

రాష్ట్రం మొత్తం మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు, బార్లు పూర్తిగా మూతపడనున్నాయి. నవంబర్ 28, 29, 30వ తేదీల్లో వరుసగా మూడు రోజులు వైన్స్ బంద్ చేయాలని అధికారులు ఆదేశించారు.అయితే.. తెలంగాణలో ఈనెల 30వ తేదీన పోలింగ్ జరగనున్న నేపథ్యంలో.. 28 నుంచి 30 వరకు వైన్ షాపులు, బార్లు మూసివేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.

ఈ మేరకు లైసెన్స్ దారులకు ఉత్తర్వులు జారీ చేశారు అధికారులు. ఈ ఆదేశాలను ఉల్లఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా అధికారులు హెచ్చరించారు.గత ఎన్నికలు, ఉపఎన్నికల్లో మద్యం ఏరులైన పారిన సంఘటనలను దృష్టిలో పెట్టుకున్న ఎన్నికల సంఘం.. ఈసారి అలా జరగకూడదని కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది..

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!