రెచ్చిపోయి గన్ మెన్ చెంప చెళ్లుమనిపించిన హోం మంత్రి…
హైదరాబాద్,అక్టోబర్06(కలం శ్రీ న్యూస్):హోం మంత్రి అంటే పోలీసులను ఏమైనా చేసుకోవచ్చు అనుకున్నట్టున్నారు తెలంగాణ హోం మం త్రి మహమూద్ అలీ. తన దగ్గర పని చేసే గన్ మెన్ చెంపను చెళ్ళుమనిపించారు.
హోం మంత్రి అంటే ఏమైనా చేసుకోవచ్చు అనుకున్నట్టున్నారు తెలంగాణ హోం మం త్రి మహమూద్ అలీ. తన దగ్గర పని చేసే గన్ మెన్ చెంపను చెళ్ళుమనిపించారు. మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ ఘటన జరిగింది.తలసాని శ్రీనివాస్ యాదవ్ పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హోంమంత్రి మహమూద్ అలీ, తలసానికి అందించేందుకు తెచ్చిన బొకే కనబడలేదు.. బొకే ఎక్కడ అంటూ గన్ మెన్ ను ప్రశ్నించిన మహమూద్ అలీ ఆగ్రహంతో గన్ మెన్ చెంపపై కొట్టారు. చెంపదెబ్బ తిన్న కానిస్టేబుల్ ఒక్క సారి షాక్ గురై హోం మంత్రి నే చూస్తూ ఉండిపోయాడు. అనంతరం వెనక ఉన్న వారు అందించిన బొకేను తీసుకుని గన్ మెన్ దానిని హోంమంత్రికి ఇచ్చారు.తనను 24 గంటలు కంటికి రెప్పలా కాపాడే గన్ మెన్ ల పట్ల హోం మంత్రి ఇలా ప్రవర్తించడం పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తమ దగ్గర పని చేసేవాళ్ళు భానిసలు కాదనే విషయాన్ని మహమూద్ అలీ లాంటి వాళ్ళు గుర్తించాలని మండిపడుతున్నారు.