Friday, September 20, 2024
Homeహైదరాబాద్జర్నలిస్టు కృష్ణారావు సేవలు మరువలేనివి

జర్నలిస్టు కృష్ణారావు సేవలు మరువలేనివి

జర్నలిస్టు కృష్ణారావు సేవలు మరువలేనివి

సంస్మరణ సమావేశంలో పలువురు వక్తలు.

హైదరాబాద్ ,సెప్టెంబర్2 (కలం శ్రీ న్యూస్): అనారోగ్యంతో ఇటీవల మరణించిన సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు సీహెచ్ వీఎం కృష్ణారావు సంస్మరణ కార్యక్రమం శనివారం హైదరాబాద్ లోని గొపన్ పల్లి జర్నలిస్టు కాలనీలో జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య కృష్ణారావు చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు. వీరితోపాటు ఫెడరేషన్ నాయకులు జే. ఉదయ్ భాస్కర్ రెడ్డి, ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు, కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు, సీనియర్ జర్నలిస్టులు కె. శ్రీనివాస్ రెడ్డి, వేణుగోపాల్, గౌరీశంకర్ లతో పాటు పలువురు జర్నలిస్టులు, బంధుమిత్రులు పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ… జర్నలిస్టుగా, రాజకీయ విశ్లేషకులుగా కృష్ణారావు సమాజానికి చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. కృష్ణారావు మరణం జర్నలిజం రంగానికి తీరని లోటని పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!