Wednesday, December 4, 2024
Homeహైదరాబాద్నేడే రాఖీ పూర్ణిమ ....

నేడే రాఖీ పూర్ణిమ ….

నేడే రాఖీ పూర్ణిమ ….

సోదరీ సోదరుల ఆత్మీయ బంధం

పర్వదినాల్లో అతి ముఖ్యమైన పండుగ

హైదరాబాద్,ఆగస్టు31(కలం శ్రీ న్యూస్):భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం రాఖీ పూర్ణిమ పర్వదినం. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున సోదరి సోదరునికి రాఖీ కట్టడం శుభ సూచకంగా భావిస్తారు. రాఖీ పండుగ ప్రతి ఏడాది శ్రావణమాసం పౌర్ణ తిథి రోజున జరుపుకుంటారు. కానీ ఈ సంవత్సరం అధిక శ్రావణమాసం రావడం ఒక విశిష్టత గా చెప్పవచ్చు. కానీ ఈ సంవత్సరం నిజ శ్రావణ మాసంలో పౌర్ణమి రెండు రోజులలో వచ్చింది అంటే 30,31. ఆగస్టు 30న భద్రకాలం ఉండడంతో 31వ తేదీన రాఖీ పౌర్ణిమ జరుపుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి. భద్ర కాల సమయంలో రాఖి కడితే తీవ్రమైన దుష్ప్రభావం చూపుతోందని అందువల్ల 31వ తేదీన రాఖీ పౌర్ణిమ గా నిర్ధారించడం జరిగింది.

రక్షాబంధనం ఎలా ప్రారంభమైంది :

పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య పుష్కరకాలం యుద్ధం సాగింది. యుద్ధంలో ఓడిన దేవతల రాజు దేవేంద్రుడు నిర్వీరుడై అమరావతిలో తలదాచుకుంటాడు. తన భర్త నిస్సాయతను గ్రహించిన దేవేంద్రుని భార్య ఇంద్రాణి పార్వతీ పరమేశ్వరులను లక్ష్మీనారాయణలను పూజించి రక్షను దేవేందర్ ని చేతికి కడుతుంది అనంతరం దేవతలందరూ పూజించిన రక్షణను ఇంద్రునికి కట్టడంతో యుద్ధంలో గెలిచి త్రిలోక ఆధిపత్యాన్ని పొందుతాడు. శశి దేవి ప్రారంభించిన ఈ రక్షాబంధనం రాఖీ పండుగ పరిగణించబడుతున్నది.

ప్రకృతి శక్తుల పరిపుష్టి రక్షాబంధన్.

మన హిందూ పండుగల్లో ప్రకృతి శక్తుల పరిపుష్టి, దేవతల అనుగ్రహం, ఆధ్యాత్మిక దృక్పథం, ఆత్మీయత అనురాగాల అనుబంధం సోదరీ సోదరుల బాంధవ్యానికి ఈ పండుగ ఒక చక్కని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. శ్రావణ పూర్ణిమ రక్షాబంధనం కు ఒక ముఖ్యమైన విశిష్టత ఉంది. ఈ రోజున సోదరీ సోదరుల ఆత్మీయత తోనికి సలాడుతుంది. ఇంటి ఆడపడుచును శ్రీ మహాలక్ష్మి గా పరాశక్తిగా భావించే సంస్కృతి మన హిందూ సంస్కృతి తల్లిదండ్రులు పెద్దవారే గతించిన అన్నదమ్ములు ఆత్మీయంగా మేము నీకు ఉన్నాం మా ఆప్యాయత అనుబంధం నీకు ఎల్లప్పుడూ అండగా ఉంటాయి. అని ధైర్యం ఇచ్చే సోదరి సోదరుల పండుగనే ఈ రక్షాబంధన్. ప్రస్తుతం ఎన్ని పాశ్చాత్య సంస్కృతులకు అలవాటు పడుతున్న ఈ రక్షాబంధన్ కార్యక్రమాన్ని మాత్రం తూచా తప్పకుండా పాటిస్తుండడం ఈ పండుగ యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. సోదరీ సోదరా నుబంధానికి నిర్మలమైన ప్రతీకగా ఆచరించే చక్కని పర్వదినం ఈ రక్షాబంధన్. కుటుంబ వ్యవస్థ బలహీనంగా ఏర్పడిన భరత భూమిలో బలీయంగా బాల్యం నుంచే తోబుట్టువుల తెలివిని బలపరిచి స్త్రీలకు పుట్టింటి అనుబంధాన్ని దృఢపరిచిన పండుగనే ఈ రక్షాబంధన్. ఈ రక్షాబంధన్ యొక్క విశిష్టతను తెలియపరచడానికి పురాణాల్లో ఎన్నో కథలు చెప్పబడినాయి.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!