మెగా కుటుంబం లో సంబరాలు
తల్లితండ్రులు అయిన రామ్ చరణ్ ఉపాసన
హైదరాబాద్,జూన్20(కలం శ్రీ న్యూస్):
ప్రముఖ నటుడు రామ్ చరణ్ ఉపాసన దంపతులు తల్లి తండ్రులు అయ్యారు.మెగా ఫ్యామిలీలో వారసుడు కోసం అభిమానులు ఎప్పటినుంచో ఎంతగానో ఎదురుచూశారు. ఆ ఎదురుచూపులు ఎట్టకేలకు ఫలించాయి. తాజాగా రామ్ చరణ్-ఉపాసన కొణిదెల దంపతులు తల్లిదండ్రులు అయ్యారు. దీంతో అటు మెగా ఫ్యామిలీలో, మెగా అభిమానుల్లో ఆనందం ఆకాశాన్ని తాకింది. అయితే ఉపాసన ఏ బిడ్డకు జన్మనిచ్చారు, వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే పూర్తి వివరాల్లోకి వెళితే..
మెగా ఫ్యామిలీలో మహాలక్ష్మీ అడుగు పెట్టింది. మంగళవారం అంటే జూన్ 20 తెల్లవారు జామున జూబ్లీహిల్స్ లోని అపోలో హాస్పిటల్ లో ఉపాసన కొణిదెల పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులు అయ్యారు. ఈ మేరకు అపోలో వైద్యులు ప్రకటన విడుదల చేశారు. రామ్ చరణ్-ఉపాసన కొణిదెల దంపతులు ఆడబిడ్డకు తల్లిదండ్రులు అయ్యారు. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా, పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు అని ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో మెగా అభిమానుల్లో సంతోషం వెల్లివిరిసింది.