Saturday, July 27, 2024
Homeతెలంగాణనీరా కేఫ్‌కు క్యూ కట్టిన జనం

నీరా కేఫ్‌కు క్యూ కట్టిన జనం

నీరా కేఫ్‌కు క్యూ కట్టిన జనం

హైదరాబాద్, మే 07(కలం శ్రీ న్యూస్):తెలంగాణ ప్రజలకు ప్రకృతి సిద్ధమైన నీరాను అందించాలని రూ.12 కోట్ల రూపాయల వ్యవయంతో నీరా కేఫ్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. హైద‌రాబాద్ నెక్లెస్ రోడ్డులో ఈ నీరా కేఫ్‌ను ఈ నెల 3 వ తేదీన మంత్రి తలసాని, శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ నీరా కేఫ్ ప్రారంభం అయినప్పటి నుంచి నీరా కేఫ్ దగ్గర జనం రద్దీగానే ఉంది. దీని రుచిని ఇప్పుడు నగర ప్రజలు ఇష్టపడుతున్నారు. ప్రకృతి సిద్దమైనది, ఎన్నో ఔషధగుణాలు కలిగినందున ఎంతో మంది తాగడానికి వస్తున్నారు. ఈ నీరాను ముఖ్యంగా ఉదయాన్నే తాగుతారు.

నేడు ఆదివారం సెలవు కావడంతో సాగర తీరంలో నీరా కేఫ్ దగ్గర నగర వాసులు క్యూ కట్టారు. ఉదయం పది గంటలకు ఈ నీరా కేఫ్ ఓపెన్ అవ్వడం తో అప్పటికే నీరా ప్రియులు కేఫ్ దగ్గరికి చేరుకున్నారు. ఎవరు కూడా అసహనానికి గురి కాకుండా పద్దతిగా లైన్ లో నిలబడి మరి నీరా రుచి చూస్తున్నారు. మధ్యాహ్నం వరకే సుమారు 15 వందల నుంచి 2 వేల మంది పబ్లిక్ కేఫ్‌కు వచ్చారని, 300 లీటర్లపైగా అమ్మకాలు జరిగాయని అక్కడి సిబ్బంది తెలిపారు. 300 ఎంఎల్ క్వాంటిటి కలిగిన నీరా బాటిల్ 90 రూపాయలు అని సిబ్బంది వెల్లడించారు. ఈ నీరాను కొనుగోలు చేసి సాగర తీరంలో ఆస్వాదించుకుంటా నీరాను నగర వాసులు తాగేస్తున్నారు. నీరా తాగడానికి వచ్చిన వారిలో ఎక్కువగా కొత్తవారే ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!