Wednesday, December 4, 2024
Homeతెలంగాణకేసీఆర్ కు తీవ్ర అస్వస్థత.. !

కేసీఆర్ కు తీవ్ర అస్వస్థత.. !

కేసీఆర్ కు తీవ్ర అస్వస్థత.. !

హైదరాబాద్,డిసెంబర్8(కలం శ్రీ న్యూస్):తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర అస్వస్థత గురైనట్లు సమాచారం. ఈ రోజు తెల్లవారు ఝామున 2.30 గంటల సమయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. దీంతో ఫార్మ్ హౌజ్ నుంచి నేరుగా సోమాజిగూడ ఆస్పత్రికి తరలించారు. తెల్లవారు ఝామున బాత్ రూమ్ కి వెళ్లగా ఆయన కట్టుకున్న పంచే తగిలి  కేసీఆర్‌ కాలు జారీ పడ్డారట!. దీంతో ఆయనకు స్వల్ప గాయాలు అయినట్లు తెలుస్తోంది. కేసీఆర్‌ కాలికి ఫ్రాక్చర్ అయినట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు కూడా చెప్పినట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది

.

 

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!