Saturday, July 27, 2024
Homeతెలంగాణముఖ్యమంత్రి కేసీఆర్ తన పదవికి రాజీనామా

ముఖ్యమంత్రి కేసీఆర్ తన పదవికి రాజీనామా

ముఖ్యమంత్రి కేసీఆర్ తన పదవికి రాజీనామా

హైదరాబాద్,డిసెంబర్3(కలం శ్రీ న్యూస్):ముఖ్యమంత్రి కేసీఆర్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను ఓఎస్డీ ద్వారా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు పంపించారు. కేసీఆర్ రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. మరోవైపు, ఎన్నికల్లో బీఆర్ఎస్ పరాభవం అనంతరం కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్ చేరుకున్నారు. ఆయన తన సొంత వాహనంలో ఫామ్ హౌస్ చేరుకున్నారు. 119 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 64 చోట్ల విజయం సాధించి, మేజిక్ ఫిగర్‌ను అందుకుంది. బీఆర్ఎస్ 39 స్థానాల్లో గెలవడం లేదా ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ 8 చోట్ల విజయం సాధించింది. కాంగ్రెస్‌కు మేజిక్ ఫిగర్ రావడంతో కేసీఆర్ రాజీనామాను సమర్పించారు.

తాజాగా వెలువడిన తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైయింది. రాష్ట్ర ప్రజలు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెప్పినట్లుగానే హస్తం పార్టీకి జనాలు విజయాన్ని అందించారు.

ఇక రెండు చోట్ల పోటీ చేసిన కేసీఆర్.. ఒక చోట గెలిచి.. రెండో చోట ఓటమిని చవిచూశారు. గజ్వేల్‌లో గెలుపొందగా.. కామారెడ్డిలో పరాజయం పాలయ్యారు. మొత్తానికి తాజా ఫలితాలతో కారు బోల్తా పడింది. ఊహించని ఫలితాలతో గులాబీ శ్రేణులు నిరాశలో మునిగిపోయారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!