Thursday, September 19, 2024
Homeతెలంగాణబర్రెలక్కకు భద్రత కల్పించండి.. హైకోర్టు ఆదేశం

బర్రెలక్కకు భద్రత కల్పించండి.. హైకోర్టు ఆదేశం

బర్రెలక్కకు భద్రత కల్పించండి.. హైకోర్టు ఆదేశం

కొల్లాపూర్,నవంబర్24(కలం శ్రీ న్యూస్):కొల్లాపూర్ స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్క అలియాస్ శిరీషకు భద్రత కల్పించాలని హైకోర్ట్  ఆదేశాలు జారీ చేసింది.. తనకు భద్రత కావాలంటూ బర్రెలక్క హైకోర్టును ఆశ్రయించగా.. శుక్రవారం మధ్యాహ్నం విచారణ చేస్తామని కోర్టు తెలిపింది. కాసేపటి క్రితమే విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం ఎన్నికలు పూర్తయ్యే వరకు బర్రెలక్కకు భద్రత కల్పించాలని ఆదేశించింది. బర్రెలక్క నిర్వహించే పబ్లిక్ మీటింగ్‌లకు భద్రత కల్పించాలని పేర్కొంది.. ఈ సందర్భంగా ఈసీకి , పోలీసులకు కోర్టు పలు సూచనలు చేసింది. గుర్తింపు ఉన్న పార్టీలకే భద్రత ఇస్తే సరిపోదని… థ్రెట్ ఉందని అభ్యర్థించే అభ్యర్థులకు సెక్యూరిటీ కల్పించాలని సూచించింది. అభ్యర్థుల భద్రత బాధ్యత ఎన్నికల కమిషన్ దే అని స్పష్టం చేసింది. పోలీసులు కేవలం కార్లు చెక్ చేస్తాం అంటే కుదరదని పేర్కొంది. బర్రెలక్కకు ఒక గన్‌మెన్‌తో భద్రత కల్పించాలని హైకోర్ట్ ఆదేశించింది. అయితే బర్రెలక్కకు 2+2 భద్రత కేటాయించాలని పిటిషనర్ కోరిన విషయం తెలిసిందే. కానీ హైకోర్టు బర్రెలక్కకు ఒక గన్‌మెన్‌తో భద్రత కల్పించాలని ఆదేశించింది.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!