Saturday, July 27, 2024
Homeబిగ్ బ్రేకింగ్మంథని నియోజకవర్గ ప్రజలు బిజెపి పార్టీ వస్తేనే అభివృద్ధి అని విశ్వసిస్తున్నారు

మంథని నియోజకవర్గ ప్రజలు బిజెపి పార్టీ వస్తేనే అభివృద్ధి అని విశ్వసిస్తున్నారు

మంథని నియోజకవర్గ ప్రజలు బిజెపి పార్టీ వస్తేనే అభివృద్ధి అని విశ్వసిస్తున్నారు

బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి

మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్

మంథని అక్టోబర్ 8( కలం శ్రీ న్యూస్):పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి పాలాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా బీజేపీ పార్టీ పనిచేస్తుంది, అందులో భాగంగా 900 కోట్లతో ములుగు జిల్లాలో సమ్మక్క సారక్క పేరు మీద గిరిజన విశ్వ విద్యాలయం,ఏర్పాటు చేస్తున్నారు.ఇచ్చిన మాట ప్రకారం నిజామాబాద్ లో పసుపు బోర్డును ఏర్పాటు చేసి ఒక చరిత్ర నిర్ణయం తీసుకున్నారు.50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి సాధ్యంకాని మహిళ బిల్లును ప్రవేశ పెట్టి చట్ట సభలో 33% రిజర్వేషన్ కల్పించి మహిళ శక్తిని ప్రపంచనికి చాటి చెప్పారు. వెనుకబడిన తరగతుల జీవితలలో వెలుగు నింపేల 18 చేతి వృత్తి కులలకు విశ్వాకర్మ యోజన పథకాన్ని ప్రవేశ పెట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వం లాగ పథకాలను నాయకులు,కార్యకర్తలకు కాకుండా లబ్ధిదారులకు, నిరుపేదలకు అందే విధంగా ఎంపిక పారదర్శకంగా ఉంటుందని చేతివృత్తుల జీవితాలను మెరుగుపరచడానికి ప్రధాని నరేంద్ర మోడీ ఒక గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది. దేశాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే విధంగా బిజెపి పాలన దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని రానున్న రోజుల్లో తెలంగాణ అభివృద్ధికి ప్రజలు బిజెపికి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు బూడిద తిరుపతి,రాష్ట్ర కౌన్సిల్ కొండపాక సత్య ప్రకాష్,బిఎస్ఏ ఇన్చార్జ్ చిలువేరి సతీష్,పట్టణ ఇంచార్జ్ సబ్బని సంతోష్, సీనియర్ నాయకులు బోగోజు శ్రీనివాస్, కోరబోయిన మల్లికార్జున్, బోయిని నారాయణ,మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు బొసెల్లి మౌనిక, మండల ప్రధాన కార్యదర్శి ఆరే ఓదెలు,పట్టణ ఉపాధ్యక్షులు గుంటిపల్లి గురువేష్,ఆకుల అరుణ్,దాసరి శ్రవణ్,రేపాక శంకర్,కాశిపేట మల్లేష్,అడ్డూరి మల్లేష్,బోసిల్లి శంకర్,మల్హర్ మండల అధ్యక్షులు ముడతన పల్లి ప్రభాకర్,బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్,కురుమ శేఖర్,ఎల్క సదానందం,గుమ్మడి నవీన్,తోటపల్లి లక్షణ్,కాపీరపు చంద్రశేఖర్,పాషా,మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!