Friday, September 20, 2024
Homeబిగ్ బ్రేకింగ్కొత్తగూడెం ఎమ్మెల్యే వనమాపై అనర్హత వేటు వేసిన తెలంగాణ హైకోర్టు:

కొత్తగూడెం ఎమ్మెల్యే వనమాపై అనర్హత వేటు వేసిన తెలంగాణ హైకోర్టు:

కొత్తగూడెం ఎమ్మెల్యే వనమాపై అనర్హత వేటు వేసిన తెలంగాణ హైకోర్టు:

కొత్తగూడెం,జూలై25(కలం శ్రీ న్యూస్):

ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్‌ దాఖలు చేసినందుకు కొత్త గూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై తెలంగాణ హైకోర్టు వేటు వేసింది. వనమాను అనర్హుడిగా ప్రకటిస్తూ జలగం వెంకట్రావును విజేతగా ప్రకటించింది. వనమాకు ఐదు లక్షల జరిమానా సైతం విధించారు.

తప్పుడు అఫిడవిట్‌ సమర్పించిన కేసులో కొత్తగూడెం సిట్టింగ్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై తెలంగాణ హైకోర్టు వేటు వేసింది. 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జలగం వెంకట్రావును విజేతగా ప్రకటించింది. ఈ మేరకు ఎమ్మెల్యేగా జలగం వెంకట్రావును ప్రకటించింది. తప్పుడు అఫిడవిట్ ఇచ్చారని 2019 జనవరి నుంచి జలగం వెంకట్రావు న్యాయపోరాటం చేస్తున్నారు. వనమాపై వచ్చిన ఆరోపణలు నిజమేనని రుజువు కావడంతో సమీప ప్రత్యర్థిని విజేతగా ప్రకటించారు.

వనమా వెంకటేశ్వరావు ఫారం 26లో భార్య ఆస్తి వివరాలు, స్థిరాస్థుల వివరాలను నామినేషన్ పత్రాల్లో పేర్కొనకపోవడంపై హైకోర్టులో జలగం వెంకట్రావ్ సవాలు చేశారు. ప్రజాప్రాతినిథ్య చట్టం నిబంధనల ప్రకారం వనమా వెంకటేశ్వరరావు పై ఐదేళ్ల అనర్హత కూడా వర్తిస్తుందని జలగం తరపు న్యాయవాది రమేష్ తెలిపారు. ఎన్నికల అఫిడవిట్‌లో పూర్తి వివరాలు వెల్లడించనందుకు ఐదు లక్షల జరిమానా కూడా విధించినట్లు వివరించారు.

2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వనమా వెంకటేశ్వరరావు ఆ తర్వాత టిఆర్‌ఎస్‌ పార్టీ తీర్తం పుచ్చుకున్నారు. త్వరలో జరుగనున్న ఎన్నికల్లో వనమా వెంకటేశ్వరరావు బిఆర్‌ఎస్ పార్టీ టిక్కెట్‌ దక్కకపోవచ్చని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అనూహ్యంగా కోర్టు అనర్హత వేటు పడటం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!